కొత్తగూడ జూన్ 13: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీ అభివృద్ధికి అధికారులు ప్రజాప్రతినిధులు సమష్టిగా కృషి చేయాలని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క (Seethakka) పిలుపునిచ్చారు. ఇందిరమ్మ ఇల్లు ప్రతి పేద వాడి కల అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు అందజేస్తామని చెప్పారు. అర్హులందరికీ ఈ పథకం వర్తిస్తుందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు.
ఏజెన్సీ గ్రామాల్లో ఎక్కువగా నిరక్షరాశులు ఉంటారని వారిని మోసం చేయడం అధికారులకు తగదని చెప్పారు. లబ్ధిదారుల వద్ద అధికారులు డబ్బులు ఆశిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు, ప్రజలు పాల్గొన్నారు. అదేవిధంగా విద్యార్థులకు దుస్తులు, పాఠ్యపుస్తకాలను మంత్రి అందజేశారు.