Shankar Naik | ‘నియోజకవర్గంలో నాకు ప్రత్యర్థులు లేరు. ఎవరైనా నిలబడితే డిపాజిట్లు వచ్చుడు కూడా కష్టమే. నాకు నేనే పోటీ.. ప్రజల మద్దతుతో మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగరేసి హ్యాట్రిక్ సాధిస్తా. ఇందులో అనుమానం లేదు. అభివృద్ధి, సంక్షేమ పథకాలే మా నినాదం.. వాటిని ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్తాం. ఒకప్పుడు ఉన్న మానుకోటకు.., ఇప్పుడు మానుకోటకు తేడాను గమనించాలని కోరుతాం. మెడికల్, నర్సింగ్, ఇంజినీరింగ్, హార్టికల్చర్ డిగ్రీ కళాశాలలతో మహబూబాబాద్ ఎడ్యుకేషనల్ హబ్‌గా మారింది. వీటిలో మెడికల్ కళాశాలలో తరగతులు నడుస్తున్నయి. ఇంజినీరింగ్, హార్టికల్చర్ డిగ్రీ కాలేజీలో ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభిస్తాం. సుమారు రూ. 200కోట్లతో మున్సిపాలిటీని అభివృద్ధి చేశా. మూడోసారి గెలిచి మహబూబాబాద్‌ను మరింత అభివృద్ధి చేస్తా’నని ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ అన్నారు. మహబూబాబాద్ నియోజకవర్గంలో రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచి, సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మూడోసారి బరిలో నిలిచిన ఆయనను శుక్రవారం ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది.
-మహబూబాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ)
మహబూబాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ‘ఈ ఏడాది జరిగే సాధారణ ఎన్నికల్లో మరోమారు మానుకోట గడ్డపై గులాబీ జెండా ఎగరేసి వేసి హ్యాట్రిక్ సాధిస్తా. 2008లో రాజకీయాల్లోకి వచ్చా. అప్పటి వరకు జనరల్‌గా మానుకోట అసెంబ్లీ స్థానం పునర్విభజనలో భాగంగా ఎస్టీకి రిజర్వ్ చేశారు. 2009 ఎన్నికల్లో ప్రజారాజ్యం పార్టీ తరఫున మానుకోట నుంచి పోటీ చేసి ఓడిపోయా. 20 వేల ఓట్లు మాత్రమే వచ్చాయి. 2009 డిసెంబర్లో ప్రజారాజ్యం అధినేత చిరంజీవి సమైక్యాంధ్ర నినాదం ఎత్తుకోవడంతో మనస్తాపం చెంది, వెంటనే కేసీఆర్‌ను కలిసి బీఆర్ఎస్లో చేరా. 2014లో టికెట్ ఇచ్చారు. 10వేల ఓట్ల మెజార్టీతో గెలిచా. సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలతో 2018లో రెండోసారి టికెట్ పొంది, 17వేల ఓట్ల మెజార్టీతో గెలిచా. విరివిగా నిధులు తీసుకొచ్చి మానుకోట రూపురేఖలు మా ర్చిన. సీఎం కేసీఆర్ సహకారంతో మానుకోటను ఎలా అభివృద్ధి చేశానో ప్రజలకు తెలుసు. అందరి ఆశీస్సులతో మానుకోట నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేశా. ఒకప్పుడు గిరిజనులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు తప్ప తండాలు, గూడేలను అభివృద్ధి చేసిన పార్టీలు లేవు. కేసీఆర్ సార్ సీఎం అయిన తర్వాత తండాల రూపురేఖలు పూర్తిగా మారినయి. 60 ఏళ్లలో జరగని అభివృద్ధి కేవలం తొమ్మిదేళ్లలోనే చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కింది’ అని మహబూబాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ శంకర్‌నాయక్ తెలిపారు. శుక్రవారం ఆయన నమస్తే తెలంగాణతో ముచ్చటించారు.
శంకర్ నాయక్: ఇప్పటికే నేను రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా పని చేశా. జిల్లా కేంద్రంలో ఆధునాతన సమీకృత కలెక్టర్ సముదాయాన్ని నిర్మించుకున్నాం. గిరిజన విద్యార్థులకు వైద్య విద్య దూరం కావొద్దని చెప్పి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి మెడికల్ కళాశాల తీసుకొచ్చిన. తరగతులు ప్రారంభించుకున్నం. అదేవిధంగా 100 బెడ్లు ఉన్న ఏరియా వైద్యశాలను 350 బెడ్లకు అప్‌గ్రేడ్ చేసి మెడికల్ కళాశాలకు అనుసంధానం చేశాం. ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల మంజూరైంది. ఈ ఏడాది నుంచే తరగతులు ప్రారంభం కానున్నాయి. అదేవిధంగా హార్టికల్చల్ డిగ్రీ కళాశాలను సీఎం కేసీఆర్ మంజూరు చేశారు. ఆ తరగతులు కూ డా ఈ ఏడాది నుంచే ప్రారంభం కానున్నాయి. జిల్లా కేంద్రంలో వెజ్ అండ్ నాన్‌వెజ్‌తో పాటు పూల మార్కెట్లను నిర్మించి పేద ప్రజలకు అందుబాటులో ఉంచాం. త్వరలోనే ఎస్పీ కార్యాలయం, మున్సిపాలిటీ భవనాలు కూడా పూర్తి కానున్నాయి. తండాలు, గూడేలకు తారురోడ్లు, సీసీ రోడ్లు వేయించా. ప్రతి ఇంటికీ తాగునీరు, నియోజకవర్గంలోని ప్రతిచెరువునూ మిషన్ కాకతీయ ద్వారా బలోపేతం చేశా. కేసముద్రం, నెల్లికుదు రు, గూడూరు, మహబూబాబాద్ మండలాల్లో రైతు లు పండించిన పంట ఉత్పత్తులు దాచుకునేందుకు ఒక్కో మండలంలో 5 వేల మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములను నిర్మించాం. ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనం, వైకుంఠధామం, నర్సరీ, డంపింగ్ యార్డులను ఏర్పాటు చేశాం. ప్రతి గ్రామ పంచాయతీకి భవనాన్ని మం జూరు చేశాం.
శంకర్‌నాయక్ : మున్సిపాలిటీని ఎంతో అభివృద్ధి చేశా. జిల్లాకేంద్రం కావడంతో రోడ్లను వెడల్పు చేయిం చాం. సెంట్రల్ లైటింగ్ పెట్టించా. జంక్షన్లను విస్తరిం చాం. ప్రజలకు అందుబాటులో ఉండేవిధంగా వెజ్ అండ్నాన్వెజ్ మార్కెట్లతోపాటు ఫ్లవర్ మారెట్ ఏ ర్పాటు చేశాం. ఆధునిక వసతులతో రూ.3 కోట్లతో జిల్లా గ్రంథాలయం నిర్మించాం. అనేక పుస్తకాలు అం దుబాటులో ఉన్నాయి. విద్యార్థులు పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు. మున్సిపాలిటీ లో ఇప్పటివరకు రూ. 200కోట్లతో అభివృద్ధి చేశాం. రానున్న రోజుల్లో మున్సిపాలిటీని మరిం త అభివృద్ధి చేసి చూపిస్తా. జిల్లా కేంద్రంలో మూడుకొట్లు, ముత్యాలమ్మ గుడి, ఇందిరాగాంధీ, నెహ్రూసెంటర్, మధర్ థెరిస్సా సెంటర్, జిల్లా బస్టాండ్, నర్సంపేట బైపాస్, వైఎస్సార్ విగ్రహం, ఇల్లందు బైపాస్‌లలో జంక్షన్లను విస్తరించా..
శంకర్ నాయక్ : 2014లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత మానుకోట జిల్లా వచ్చుడో, శంకర్‌నాయక్ సచ్చుడో అని పోరాడి మానుకోట జిల్లాను తెచ్చుకు న్నాం. ఇనుగుర్తిని మండలం చేసుకున్నం. సుమారుగా 150 తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చుకున్నాం. కేసముద్రాన్ని మున్సిపాలిటీ చేయడంతో పా టు కేసముద్రం మండల కేంద్రానికి ఫైర్ స్టేషన్ తీసుకురావాల్సి ఉంది. ప్రతి గ్రామ పంచాయతీకి పక్కా భవనం నిర్మించే ప్రక్రియ కొనసాగుతున్నది. అంతేకాకుండా నియోజకవర్గంలో అకడకడా కొన్ని రోడ్లు, భవనాలు నిర్మించాల్సిఉంది. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉండి ఏం చేశానో చెబుతా.. భవిష్యత్‌లో చేయబోయే కార్యక్రమాలను వివరిస్తా. ఎన్నికల ముం దు, తర్వాత ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా.
శంకర్‌నాయక్ : వచ్చే ఎన్నికల్లో నాకు పోటీగా నిలిచేవారు ఎవరూ లేరు. నాకు నేనే పోటీ, నాకు నేనే సా టి. అటు కాంగ్రెస్ నుంచి, ఇటు బీజేపీ నుంచి కానీ పోటీ చేసే అభ్యర్థులు బీఆర్ఎస్ అభ్యర్థుల చేతిలో ఓడిపోవడం ఖాయం. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సం క్షేమ పథకాలే గెలిపిస్తాయి. అంతేకాదు. గతంలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చా. రైతులకు ఉచిత విద్యుత్ 3గంటలు చాలంటున్న పార్టీకి, నిత్యాసవరాల సరుకులతోపాటు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధర లు పెంచి సామాన్యుల నడ్డివిరిచిన బీజేపీకి ప్రజలు ఓటు వేసే పరిస్థితిలో లేరు. అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్న బీఆర్ఎస్ అభ్యర్థికి ఓటువేసి గెలిపించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.
శంకర్‌నాయక్: మానుకోట నియోజకవర్గంలో 40శాతం మంది గిరిజన ప్రజలు ఉన్నారు. వీరందరూ వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఒక గిరిజనుడిగా గిరిజన ప్రజల సమస్యలు నాకు బాగా తెలుసు. అందుకని పాత పంచాయతీల నుంచి తండాలు, గూడేలను వేరు చేసి వార్డులు, గ్రామ పంచాయతీలను కొత్తగా ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రతి తండాకు మిషన్ భగీరథ నీరు అందిస్తున్నం. తారు, సీసీ రోడ్లు నిర్మించాం. పేదలకు నాణ్యమైన వైద్యం, విద్య అందిస్తున్నాం. జిల్లాలో గత ఏడాది నుంచి నడుస్తున్న మెడికల్ కళాశాలలో సగం సీట్లు జిల్లా విద్యార్థులకే దక్కుతున్నాయి. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల, హార్టికల్చరల్ డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభమైతే ఇక్కడి విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది. గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు, గిరిజన రిజర్వేషన్‌ను 6శాతం నుంచి పది శాతానికి పెంచడం వల్ల విద్య, ఉద్యోగ అవకాశాల్లో మరింత మందికి న్యాయం జరగుతుంది.
శంకర్ నాయక్ : బీఆర్ఎస్ పార్టీ, సీఎం కేసీఆర్‌ను నేను జీవితంలో మరువను. అమ్మానాన్నలు నాకు జన్మనిస్తే.. కేసీఆర్ రాజకీయ జన్మనిచ్చారు. నా చివరి రక్తపు బొట్టు ఉన్నంతవరకు ఆయనతోనే ఉంటా. మానుకోట ప్రజలే నా బలం.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలే నా బలగం. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, ఎంపీ కవిత, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్రావు ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టితో విజయం సాధిస్తా. కాంగ్రెస్, బీజేపీ, ఇతర పార్టీల అభ్యర్థులకు డిపాజిట్లు వచ్చుడు కష్టమే. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలు దళితబంధు, బీసీబంధు, మైనార్టీబంధు పేద, మధ్య తరగతి ప్రజల ఉపాధికి భరోసాగా నిలుస్తున్నాయి.
శంకర్‌నాయక్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరుతాం. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్, పంట పెట్టుబడి కోసం రైతుబంధు, రైతు బీమా తదితర పథకాలు ప్రభుత్వం అందిస్తున్నది. మానుకోట నియోజకవర్గంలో నేను చేసిన, చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు వివరిస్తూ ఎన్నికల్లో ముందుకు సాగుతా. ఇప్పటి వరకు చేసిన అభివృద్ధితో పాటు ఈ ఎన్నికల్లో తనను గెలిపిస్తే నియోజకవర్గంలో చేసే అభివృద్ధిని వివరిస్తా. ఇప్పటికే తండాల్లో రూ.200 కోట్లతో తారు, సీసీ రోడ్లు వేశాం. తండాలు అన్ని రంగాల్లో అభివృద్ధిలో ఉన్నాయి.