కురవి : నేడు కందికొండ జాతరకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మహబూబాబాద్ జిల్లా ఎస్పీ నంద్యాల కోటిరెడ్డి అన్నారు. కురవి మండలంలోని కందికొండ గుట్ట దిగువ బాగాన జరిగే జాతర ప్రదేశాన్ని గురువారం ఎస్పీ కోటిరెడ్డి పరిశీలించారు. జాతర బందోబస్తు గురించి పోలీసులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు సీఐలు, 15మంది ఎస్సైలు, 200మంది పోలీసు సిబ్బంది జాతర బందోబస్తులో పని చేస్తారన్నారు. ఇప్పటికే పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు తెలిపారు.
జాతరకు వచ్చే యువత పోలీసులకు సహకరించాలన్నారు. ట్రాఫిక్ సమస్య ఏర్పడకుండా వాహనదారులు, భక్తులు పోలీసులకు పూర్తిగా సహకరించాలన్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన వన్వేలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మరిపెడ సీఐ సాగర్, ఎస్సై సంతోష్రావుతో పాటు పలువురు ఎస్సైలు పాల్గొన్నారు.