జిల్లాలో 7,557 మంది రెగ్యులర్,
13 మంది బ్యాక్‌లాగ్‌లో ఉత్తీర్ణత
3,960 మందికి 10/10 జీపీఏ
వీరిలో బాలికలు 2,219 మంది,
బాలురు 1,741 మంది
చెన్నారావుపేట, మే 21 : జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో 2020- 21 విద్యా సంవత్సరానికి చెందిన 7,557 మంది రెగ్యులర్ విద్యార్థులు, 13 మంది బ్యాక్‌లాగ్‌లో ఉత్తీర్ణుల య్యారు. టెన్త్ ఫలితాలను డీఈవో డీ వాసంతి శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎఫ్ఏ-1 పరీక్షలకు వచ్చిన మార్కుల ఆధారంగా విద్యార్థులను పాస్ చేసి ఫలితాలను విడుదల చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలో మొత్తం 3,960 విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. వీరిలో బాలికలు 2,219 మంది, బాలురు 1,741 మంది ఉన్నట్లు వాసంతి పేర్కొన్నారు. 10/10 జీపీఏ సాధించిన విద్యార్థుల వివరాలను మండలాల వారీగా డీఈవో వెల్లడించారు. ఆత్మకూరు మండలంలో 57 మంది బాలురు, 151 మంది బాలికలతో మొత్తం 208 మంది విద్యార్థులు, చెన్నారావుపేట మండలంలో 140 మంది బాలురు, 135 మంది బాలికలతో మొత్తం 275 మంది విద్యార్థులు. దామెర మండలంలో 166 మంది బాలురు, 85 మంది బాలికలతో మొత్తం 251 మంది విద్యార్థులు, దుగ్గొండి మండలంలో బాలురు 36 మంది, బాలికలు 79 మందితో మొత్తం 115 మంది విద్యార్థులు, గీసుగొండ మండలంలో బాలురు 105 మంది, బాలికలు 182 మందితో మొత్తం 287 విద్యార్థులు, ఖానాపూర్ మండలంలో బాలురు 83 మంది, బాలికలు 84 మందితో మొత్తం 167 మంది
విద్యార్థులు, నడికూడ మండలంలో బాలురు 10 మంది, బాలికలు 14 మందితో మొత్తం 24 మంది విద్యార్థులు, నల్లబెల్లి మండలంలో బాలురు 114 మంది, బాలికలు 114 మందితో మొత్తం 228 మంది విద్యార్థులు, నర్సంపేట మండలంలో బాలురు 368 మంది, బాలికలు 355 మందితో మొత్తం 723 మంది విద్యార్థులు, నెక్కొండ మండలంలో 110 మంది బాలురు, 267 మంది బాలికలతో మొత్తం 377 మంది విద్యార్థులు, పరకాల మండలంలో 183 మంది బాలురు, 174 మంది బాలికలతో మొత్తం 357 మంది విద్యార్థులు, పర్వతగిరి మండలంలో 55 మంది బాలురు, 159 మంది బాలికలతో మొత్తం 214 మంది విద్యార్థులు, రాయపర్తి మండలంలో 57 మంది బాలురు, 138 మంది బాలికలతో మొత్తం 195 మంది విద్యార్థులు, సంగెం మండలంలో 38 మంది బాలురు, 95 మంది బాలికలతో మొత్తం 133 మంది విద్యార్థులు, శాయంపేట మండలంలో 131 మంది బాలురు, 97 మంది బాలికలతో మొత్తం 228 మంది విద్యార్థులు, వర్ధన్నపేట మండలంలో 88 మంది బాలురు, 90 మంది బాలికలతో మొత్తం 178 మంది విద్యార్థులు 10 /10 జీపీఏ సాధించినట్లు డీఈవో వాసంతి తెలిపారు.mahabubabad 22-05-2021