రాయపర్తి, జూన్ 11 : మండలంలోని కొండూరు గ్రామానికి చెందిన గోనెల రాజు ఇటీవల మరణించాడు. ఈ నేపథ్యంలో మృతుడి కుటుంబ సభ్యులకు మత్స్యపారిశ్రామిక సహకార సంఘం యువజన విభాగం ప్రతినిధులు శుక్రవారం రూ.10,500 అందజేశారు. ఈ కార్యక్రమంలో సంఘం ప్రతినిధులు పూస మధు, కుమార్, గుంటుక పెద్ద యాకయ్య, ముత్యాల అజయ్, గుంటుక హరీశ్, బాషబోయిన కరుణాకర్, పందెబోయిన దుర్గయ్య, పూస ప్రభాకర్, యాకయ్య, గుం టుక భాస్కర్, చిన్న యాకయ్య, ఆకుల సోమయ్య, సురేశ్ పాల్గొన్నారు.
కాట్రపల్లిలో బియ్యం అందజేత…
కాట్రపల్లి గ్రామానికి చెందిన ఇల్లబెల్లి సోమయ్య ఇటీవల మృత్యువాతపడ్డారు. మృతుడి కుటుంబాన్ని శుక్రవారం గ్రామ సర్పంచ్ బోనగిరి ఎల్లయ్య పరామర్శించారు. అనంతరం మృతుడి కుమారులు ఇల్లబెల్లి సంపత్, ప్రవీణ్, సాగర్‌కు ధైర్యం చెప్పి 50 కిలోల బియ్యం అందజేశారు. ఆయన వెంట టీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు మండల శ్రీధర్, ఉప సర్పంచ్ కందుకూరి రేణుక, గుమ్మడిరాజుల శ్రీనివాస్, వార్డు సభ్యులు మొర్రి రాజేందర్, చిడిమిల్ల అశోక్‌కుమార్, కత్తి సోమన్న, బూడిద యాకయ్య, పెద్ద యాకయ్య, కందుకూరి భిక్షపతి ఉన్నారు.