నర్సింహులపేట మార్చి 10 : మండలంలోని వివిధ గ్రామాల శివారు ఆకేరు వాగు నుండి అనుమతులు లేకుండా అక్రమ ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లును రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. కాగా, సోమవారం తహసీల్దార్ నాగరాజు సమక్షంలో వేలం(Sand auction )నిర్వహించారు. ఇసుక వేలంలో 20 మంది పాల్గొన్నగా ప్రతి వ్యక్తి రూ.5000 రూపాయలు చెల్లించి ఇసుక కోసం పోటీపడ్డారు. ఆకేరు వాగు నుండి అక్రమ ఇసుక రవాణా చేయకుండా జిల్లా ఎస్పీ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడంతో ఇసుక కోసం ఎక్కువ మొత్తంలో పోటీపడ్డారు.
తహసీల్దార్ కార్యాలయంలో ఉన్న సుమారు పదిహేను ట్రిప్పుల ఇసుకను వేలం వేయగా, ఒక ట్రిపు ఇసుక కు రూ.5,700 చొప్పున కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు జినగల రమేష్ దక్కించుకున్నారు. వేలంలో దక్కించుకున్న ఇసుకను మండల కేంద్ర పరిధిలోని నర్సింహులపేటలో మాత్రమే పోసుకోవాలని తహశీల్దార్ తెలిపారు. అక్రమ ఇసుక రవాణా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇసుక రవాణా చేస్తున్న వారి వివరాలను 100 కాల్ కు సమాచారం అందించాలని సూచించారు.