గండీడ్, ఏప్రిల్ 8 : పేదల సంక్షేమానికి ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి అన్నా రు. మండలకేంద్రంలో శుక్రవారం 66మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడబిడ్డల పెండ్లి తల్లిదండ్రులకు భారం కావొద్దన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ కల్యాణలక్ష్మి పథకం అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడాలేని పథకాలను అమలు చేస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కిందన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీపీ మాధవి, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, తాసిల్దార్ జ్యోతి, ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి పాల్గొన్నారు.
మహ్మదాబాద్, ఏప్రిల్ 8 : మండలంలోని గాధిర్యాల్లో సర్పంచ్ వెంకట్రాంరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి ప్రా రంభించారు. అదేవిధంగా చీకర్లబండతండాలో తాలూకాస్థాయి ప్రీమియర్లీ గ్ క్రికెట్ టోర్నీని ఎమ్మెల్యే ప్రారంభించా రు. కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెంట్యానాయక్, సర్పంచ్ రా ఘవేందర్, హన్మంత్, ఎంపీటీసీ రాములమ్మ, ఉపసర్పంచ్ రామకృష్ణ, మాజి ఎంపీటీసీ హన్మంతుగౌడ్, శ్రీను, అంజిలయ్యగౌడ్, వెంకటయ్య పాల్గొన్నారు.