మరిపెడ : తెలంగాణ జాగృతి రాష్ట్ర అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు(MLC Kavitha) మరిపెడలో బీఆర్ఎస్ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. సోమవారం మహబూబాబాద్ జిల్లాలో ఒక్కరోజు పర్యటనలో భాగంగా డోర్నకల్ నియోజకవర్గంలోని దంతాలపల్లి, మరిపెడ, కురవి మీదగా మహబూబాబాద్‌కు వెళ్తున్న క్రమంలో మరిపెడలో ఎమ్మెల్సీ కవితకు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు గాంధీ సెంటర్లో ఘనంగా స్వాగతం పలికి శాలువాలతో సత్కరించారు. బీఆర్ఎస్ శ్రేణులు పటాకులు పేల్చి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
స్వాగతం పలికిన వారిలో మహబూబాబాద్ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గుడిపూడి నవీన్ రావు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ద సుదర్శన్ రెడ్డి, మాజీ ఓడి సిఎంఎస్ చైర్మన్ కొడితి మహేందర్ రెడ్డి, డిఎస్ రవిచంద్ర ఉన్నారు. అలాగే మండల నాయకులు మాజీ ఎంపీపీలు గుగులోతు వెంకన్న, అరుణ రాంబాబు, మాజీ సర్పంచ్ పోరం అధ్యక్షులు తాళ్లపల్లి శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి శారద రవీందర్ పాల్గొన్నారు. కాగా మండలంలోని చిల్లంచర్ల గ్రామంలో జాగృతి నాయకురాలు మారిపల్లి మాధవి నూతన గృహప్రవేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కురవికి బయలుదేరి వెళ్లారు.