బచ్చన్నపేట, ఆగస్టు 23 : జాతీయ ఉపాధి హామీ పనులకు సంబంధించిన రికార్డులను పకడ్బందీగా నిర్వహించాలని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. సోమవారం మండలంలోని నక్కవానిగూడెంలో ఉపాధి పథకంలో చేసిన పనుల రికార్డులను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా జడ్పీ సీఈవో మాట్లాడుతూ గ్రామాల్లో ఉపాధిహా మీ పథకం అమలు తీరుపై పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండాలని, ఏడు రిజిస్టర్లతో సహా 31 రికార్డులను అప్డేట్ చేసుకోవాలని సూచించారు. ఉపాధి జాబ్కార్డులె న్ని.. ఎవరెవరు వంద రోజులు పని చేశారు.. ఎన్ని పనులు చేశారు.. ఎంత ఖర్చు అయిందన్న వివరాలతో కూడిన రిజిస్టర్లు సక్రమంగా ఉండాలని ఆదేశించారు. అదేవిధంగా విజిటర్ల రిజిస్టర్లను తయారు చేయాలని, రిజిస్టర్ల నిర్వహణపై అధికారులు తనిఖీలకు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. ఆమె వెంట ఎంపీడీవో రఘురామకృష్ణ, టీఏ కరుణాకర్, పంచాయతీ కార్యదర్శి కల్యాణి పాల్గొన్నారు.
రికార్డుల నిర్వహణపై అవగాహన
ఉపాధిహామీ పథకం అమలులో నిర్వర్తిస్తున్న రికార్డులన్నీ పూర్తి వివరాలతో ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని జడ్పీ సీఈవో విజయలక్ష్మి అన్నారు. ఎంపీడీవో కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులు, ఈజీఎస్ అధికారులకు రికార్డుల నిర్వహణపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి డీఆర్డీవో రాంరెడ్డి, ఎంపీడీవో రఘురామకృష్ణ, మండల ప్రత్యేకాధికారి శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు. అనంతరం జడ్పీ సీఈవో మాట్లాడుతూ రికార్డులను పూర్తి వివరాలతో అప్డేట్ చేయాల్సిన బాధ్యత పంచాయతీ కార్యదర్శిపై ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండలం లో ఆయా గ్రామ పంచాయతీల కార్యదర్శులు భీమ్రాజ్, రేవతిగౌడ్, రూపా చైతన్య, మోకు కవిత, రుబీనా సుల్తా నా, రాజశేఖర్, దేవీప్రసాద్, రాజన్‌బాబు, ప్రశాంత్ ఆచా ర్య, సతీశ్‌రెడ్డి, సురేశ్, శ్రీనివాస్‌రెడ్డి, భరత్, కిరణ్, ఉపేందర్, శ్రీనివాసాచారి, టీఏలు సత్యనారాయణ, కరుణాకర్, భాను తదితరులు పాల్గొన్నారు.