త్వరలో రైల్వే దవాఖాన సబ్ డివిజన్‌గా ఉన్నతీకరణ
అధికారుల పనితీరు భేష్
దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా
కాజీపేట ఆగస్టు 19: రెండు ఫిట్‌లైన్ల పనులు పూర్తయితే కాజీపేట రైల్వే జంక్షన్‌కు మహర్దశ పట్టనుందని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా అన్నారు. గురువారం కాజీపేట రైల్వే జంక్షన్, కమలాపూర్ మండలం ఉప్పల్‌లోని పలు కార్యాలయాల తనిఖీలు, అభివృద్ధి పనుల పరిశీలన, ప్రారంభోత్సవాలు చేశారు. సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైలులో ఆయన రైల్వే ఉన్నతాధికారులతో కలిసి వచ్చారు. డీజిల్ షెడ్డు సమీపంలో రూ. 20 కోట్లతో చేపట్టిన 26 కోచ్‌ల రెండు ఫిట్‌లైన్ అభివృద్ధి పనులను పరిశీలించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా నూతన కార్యాలయాల ఎదుట మొక్కలు నాటారు. అనంతరం ఈఎల్ఎస్ రైల్వే క్వార్టర్స్‌లో వాటర్ ప్లాంట్‌ను ప్రారంభించారు. రైల్వే కార్మికులు, కార్మిక కుటుంబాల కోసం ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను సందర్శించారు. రైల్వే పాలిక్లినిక్ దవాఖానను, జంక్షన్‌లోని ఫ్లాట్‌ఫారాలను, ఎక్స్‌లేటర్ పనులు పరిశీలించారు. వాటిని వెంటనే పూర్తి చేయించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాజీపేట రైల్వే జంక్షన్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. రైల్వే అధికారుల పనితీరు బాగుందని తెలిపారు. రైల్వే పాలి క్లినిక్‌ను సబ్ డివిజన్ దవాఖానగా త్వరలోనే ఉన్నతీకరించనున్నట్లు తెలిపారు.
కాజీపేట- పెద్దపల్లి రైల్వేస్టేషన్ల మధ్య మూడో లైన్ పనులు వేగంగా ముందుకు సాగుతున్నాయన్నారు. ఈ సందర్భంగా రైల్వే మజ్దూర్ యూనియన్, ఎంప్లాయిస్ సంఘ్, తెలంగాణ రైల్వే జేఏసీల నాయకులు పలు సమస్యలపై జీఎంకు వినతి పత్రాలను అందజేశారు. ఆయన వెంట సికింద్రాబాద్ రైల్వే డీఆర్ఎం ఏకే గుప్తా, ఉన్నతాధికారులు రవీంద్రనాథ్‌రెడ్డి, ధనుంజయ్య, అమీత్ గోయల్, ప్రశాంత్ రెడ్డి, ఆనంద్ చకీలా, నవీన్‌కుమార్, రామారావు, డాక్టర్ రవీంద్ర శర్మ, ఏకే సింగ్, శ్రీనివాస్‌రెడ్డి, అక్కిరెడ్డి, నవ్యతోపాటు రైల్వే మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు కాలువ శ్రీనివాస్, డివిజన్ కార్యదర్శి పిల్లలమర్రి రవీందర్, నాయిని సదానందం, రవీందర్, సాయికుమార్, ఎస్కే జానీ, సమ్మయ్య, ఎంప్లాయీస్ సంఘ్ నుంచి ఐఎస్ఆర్ మూర్తి, అగ్గి రవీందర్, రాజ్‌కుమార్, రాజలింగం, తెలంగాణ రైల్వే జేఏసీ కన్వీనర్ దేవులపల్లి రాఘ వేందర్, చైర్మన్ కొండ్ర నర్సింగరావు, తిరుపతి, సంగమయ్య, భాస్కర్‌రావు, మహేశ్‌కుమార్ తదితరులు ఉన్నారు.