డోర్నకల్, ఆగస్టు 14 : మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ బజ్జూరీ ఉమా తండ్రి రేగళ్ల చంద్రారెడ్డి (80) ఈనెల 12న గురువారం అనారోగ్యంతో గొల్లచర్ల గ్రామంలో మృతి చెందాడు. విషయం తెలుకున్న ఎంపీ కవిత మృతుడి స్వగృ హం గొల్లచర్ల గ్రామానికి వెళ్లి ఆయన చిత్ర పటం వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించారు. అదే విధంగా మున్సిపాలిటీ పరిధిలోని యాదవ్‌నగర్‌కు చెందిన రిటైడ్ ఎంఈవో నాగరాజు సతీమణి నారంబట్ల సామాజ్య్రం (80) శుక్రవారం మృతి చెందగా, వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆమె వెంట మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నున్న రమణ, పీఏసీఎస్ చైర్మన్ చేరెడ్డి భిక్షంరెడ్డి, టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు కత్తెరసాల విద్యాసాగర్, వార్డు కౌన్సిలర్లు పోటు జనార్దన్, కాల సురేందర్ జైన్, శరత్ బాబు, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు షేక్ అజిత్ మియా, టీఆర్ఎస్ జిల్లా నాయకులు బజ్జూరీ పిచ్చిరెడ్డి, ముళ్ల రమేశ్, గొల్లచర్ల సర్పంచ్ సమ్మిరెడ్డి, టీఆర్ఎస్ నాయకులు కొత్త వీరన్న, పచ్చిపాల గోపీ పాల్గొన్నారు.
నెల్లికుదురు: మండలంలోని మేచరాజుపల్లికి చెందిన గండు బుచ్చయ్య భార్య గండు వీరమ్మ ఇటీవల మృతి చెందారు. కాగా, ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బా నోత్ శంకర్ నాయక్ శనివారం మృతురాలి చిత్రపటానికి పూ లమాల వేసి నివాళులర్పించారు. ఎంపీపీ ఎర్రబెల్లి మాధవి, జడ్పీటీసీ మేకపోతుల శ్రీనివాస్ రెడ్డి, మునిగలవీడు సర్పంచ్ నల్లాని నవీన్ రావు, నాయకులు పొన్నాల యుగేంధర్,రాజు పాల్గొన్నారు.
కురవి: మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ కార్యకర్తల కుటుంబాలను ఎంపీ మాలోత్ కవిత శనివారం పరామర్శించారు. రాజోలు గ్రామంలో మరిపెడ డివిజన్ ఆత్మచైర్మన్ తోట లాలయ్య కుమారుడు వెంకటరామరాజు అనారోగ్యం చెందగా, ఆరోగ్య స్థితి తెలుసుకుని పరామర్శించారు. గ్రామానికి చెందిన తోట రాములు ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని ఓదార్చారు. కురవి మండల కేంద్రానికి చెందిన పూజారి బుక్క వీరన్న తల్లి మృతి చెందగా బాధిత కుటుంబసభ్యులు పరామర్శించారు. ఆమె వెంట ఆలయ చైర్మన్ బీ రామూనాయక్, ఆర్బీఎస్ మండల కోఆర్డినేటర్ ముండ్ల రమేశ్, మాజీ ఓడీసీఎంఎస్ చైర్మన్ నూకల వేణుగోపాల్‌రెడ్డి, టీఆర్ఎస్వీ జిల్లా కో ఆర్డినేటర్ గుగులోత్ రవి, ఎంపీటీసీలు చిన్నం భాస్కర్, సీహెచ్ గణేశ్, మాజీ ఎంపీపీ జీ రాంచంద్రయ్య, మేక నాగిరెడ్డి పాల్గొన్నారు.