బయ్యారం, ఆగస్టు 11: ప్రతి ఒక్కరూ పరిసరాలు శుభ్రం గా ఉంచుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు సూచించారు. శుక్రవారం మండలంలోని వినోభనగర్ గ్రామంలో ఫ్రైడే డ్రైడేలో భాగంగా గ్రామాల్లో పర్యటించారు. గ్రామాల్లోని పరిసరాలు శుభ్రంగా ఉంచాలని పం చాయతీ సిబ్బందిని ఆదేశించారు. అదే విధంగా వాటర్ ట్యాంక్ లీకేజ్ ఉండడంతో వెంటనే మరమ్మతులు చేయాలన్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ వెంకన్న, సొసైటీ చైర్మన్ మధుకర్‌రెడ్డి, ఎంపీడీవో చలపతిరావు, ఏవో రాంజీనాయక్, ఎంపీవో పద్మ పాల్గొన్నారు.
స్వచ్ఛ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం
డోర్నకల్ : స్వచ్ఛమున్సిపాలిటీగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ వాంకుడోత్ వీరన్న సూచించారు. శుక్రవారం మున్సిపాలిటీ పరిధిలోని 5వ వార్డు సోమ్లాతండాలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షాకాలం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నందున ప్రజలు తమ ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలన్నారు. శుభ్రత ఉన్నప్పుడే ఆరోగ్యం లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు వాంకుడోత్ హరి, వాంకుడోత్ కస్నా, వాంకుడోత్ భాస్కర్, ఆర్పీ సాల్క్, అంగన్ వాడీ కర్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత..
గార్ల : పరిసరాల శుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యతని మేజర్ పంచాయతీ సర్పంచ్ అజ్మీరా బన్సీలాల్ నాయక్ సూచించారు. ఫ్రైడేడ్రైడేని పురస్కరించుకుని శుక్రవారం స్థానిక పంచాయతీ పరిధిలోని 14వార్డుల్లో వీధులను శుభ్రం చేశారు. మురుగు నీటిని తొలగించారు. తడిపొడి చెత్తను వేరు చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ప్రణవి, కార్యదర్శి జీ లక్ష్మణ్, హెల్త్ ఇన్స్పెక్టర్ ఇస్మాల్, ఆశ కార్యకర్తలు పాల్గొన్నారు.