కలెక్టర్ అభిలాషా అభినవ్
మహబూబాబాద్, ఆగస్టు 7: క్యాన్సర్ బారిన పడ్డ వ యోవృద్ధులకు చికిత్స అందించడంతో పాటు మనోధై ర్యం కల్పించాలని వైద్యాధికారులకు కలెక్టర్ అభిలాషా అభినవ్ సూచించారు. శనివారం కలెక్టర్ కార్యాలయం నుంచి జిల్లాలోని వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్ నిర్వహిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా లో క్యాన్సర్తో బాధపడుతున్న వారిని గుర్తించి, వైద్యం అందించాలని సూచించారు. వారు తీసుకునే ఆహారం అన్ని రకాల న్యూట్రీషన్లు ఉండేలా చూడాలన్నారు. క్యా న్సర్ రోగుల కోసం జిల్లా దవాఖానలో 10 టెక్నాలజీతో కూడిన ఫ్రీ బెడ్లను ఏర్పాటు చేసినట్లు వివరించారు. క్యా న్సర్ రోగులను గుర్తించేందుకు ముందుగా బయ్యారం, కంబాలపల్లి, కురవి, ప్రాథమిక కేంద్రాల్లో సర్వే చేస్తున్నట్లు దీని కోసం ఇద్దరు వైద్యులను ప్రత్యేకంగా నియమించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి హరీశ్రాజ్, దవాఖాన పర్యవేక్షకుడులు వెంకట్రాములు, చింత రమేశ్, వైద్యులు పాల్గొన్నారు.