పార్టీలకతీతంగా పాల్గొంటున్న ప్రజాప్రతినిధులు
సమస్యలను గుర్తించి పరిష్కరిస్తున్న అధికారులు, నాయకులు
పనుల్లో నిర్లక్ష్యంపై మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్ ఆగ్రహం
మహబూబాబాద్‌లో పర్యవేక్షించిన పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా
నమస్తే నెట్వర్క్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా పల్లె, పట్టణ ప్రగతి పనులు జోరందుకున్నాయి. ప్రజాప్రతినిధులు, అధికారులు, స్థానికుల భాగస్వామ్యంతో ఎక్కడికక్కడ వేగం పుంజుకున్నాయి. మంగళవారం మహబూబాబాద్ మండలం జంగిలికొండలో పల్లె ప్రగతి పనులను జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తో కలిసి పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా పర్యవేక్షించి గ్రామసభ ఆమోదంతో పనులు చేయాలని చెప్పారు. నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో దళితవాడలో మహబూబాబాద్ కలెక్టర్ వీపీ గౌతమ్ పల్లెనిద్ర చేసి సమస్యలు తెలుసుకున్నారు. పనుల్లో నిర్లక్ష్యం చేస్తున్న విద్యుత్, ఏపీవీ, మిషన్ భగీరథ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆ తర్వాత సైడ్‌డ్రైన్ మట్టితో నిండిపోవడంతో స్వయం గా ఆయనే పారపట్టి పూడిక తీశారు. హన్మకొండ పద్మాక్షి కాలనీలోని శ్మశానవాటికలో మేయర్ గుండు సుధారాణితో కలిసి చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ పట్టణ ప్రగతి పనులను పరిశీలించారు. 27వ డివిజన్లో తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ పాల్గొని మొక్కలు నాటారు. వర్ధన్నపేట మున్సిపాలిటీలో పబ్లిక్ టాయిలెట్లను ఎమ్మెల్యే అరూరి రమేశ్ ప్రారంభించి, పట్టణ ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. భూ పాలపల్లి మండలం ఆజంనగర్‌లో, నందిగామ, దూదేకులపల్లి గ్రా మాల్లో పల్లె ప్రగతి పనులను పరిశీలించి మొక్కలు నాటారు. జఫర్‌గఢ్ మండ లం తిమ్మంపేటలో ఎమ్మెల్యే రాజయ్య పల్లెనిద్ర చేసి దళితవాడల్లో పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు. సీసీరోడ్ల నిర్మాణానికి రూ.కోటి, ఎస్సీ కమ్యూనిటీ హాల్, ప్రహరీ నిర్మాణానికి రూ.15లక్షలు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. హరితహారంలో భాగంగా హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రాంగణంలో అధ్యాపకులు, విద్యార్థులు విరివిగా మొక్కలు నాటారు.