మహదేవపూర్, జనవరి 11 : చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులను శాసన మండలిలో ప్రతిపక్ష నేత, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పరామర్శించారు. బాధితులకు న్యా యం జరిగే వరకు అండగా ఉంటామని భరోసానిచ్చారు. శనివారం ఆయన మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని ఎల్కేశ్వరం, సూరా రం గ్రామాల్లో పర్యటించారు. భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడారు. ఎలాంటి పరిహారం చెల్లించకుండా భూములు లాక్కొని చేపట్టిన కెనాల్ ట్రెంచ్ పనులను క్షేత్రస్థాయిలో రైతులతో కలిసి పరిశీలించారు. ఎంత మేర భూములు కోల్పోతున్నా రు? ఎంత మందికి పరిహారం అందలేదు? అన్న విషయాలను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భం గా ఏండ్లుగా భూమినే నమ్ముకున్న తమకు అధికారులు నష్టపరిహారం చెల్లించకుండానే వందల మంది పోలీసుల పహారాలో దౌర్జన్యంగా పనులు చేస్తున్నారని, న్యాయం అడిగితే వేధింపులకు గురిచేస్తున్నారని రైతులు గోడు వెళ్లబోసుకున్నారు. పనులు అడ్డుకున్న బాధితులను అరెస్ట్ చేశారని, రైతులపై కనికరం చూపకుండా భూముల్లోకి చొరబడ్డారని కన్నీరుమున్నీరయ్యారు. సిరికొండ మాట్లాడుతూ నష్టపరిహా రం ఇవ్వకుండా పోలీసుల బందోబస్తుతో భూములు లాక్కొని చిన్న కాళేశ్వరం పనులు చేపట్టడం దారుణమన్నారు. రైతులకు కనీస సమాచారం ఇవ్వకుం డా కెనాల్ పనుల కోసం పంటలను ధ్వంసం చేయమేంటని మండిపడ్డారు. ప్రాజెక్టులో కోల్పోతున్న భూములతో పాటు పంటలకు సైతం పరిహారం చె ల్లించాలని డిమాండ్ చేశారు.
గత కేసీఆర్ ప్రభుత్వం హయాంలో రైతులు సంతోషంగా ఉన్నారని, కాళేశ్వరం ప్రాజెక్టులో భూములను కోల్పోయిన వారికి న్యాయం చేశామని గుర్తు చేశారు. రైతుల సంక్షేమమే ధ్యేయంగా కేసీఆర్ ముందుకు సాగారని, అన్నదాతల కళ్లల్లో ఆనందం కోసం నిరంతరం శ్రమించారన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలనలో రైతులు ఆగమయ్యారన్నారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చిన్న కాళేశ్వరం భూనిర్వాసితులకు మె రుగైన పరిహారం చెల్లిస్తామని మ్యానిఫేస్టోలో పొందుపర్చిన కాంగ్రెస్ మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్‌బాబు అధికారంలోకి రాగానే హామీలను మరిచారన్నారు.
పుట్ట మధు మాట్లాడుతూ చిన్న కాళేశ్వరం పనుల సందర్భంగా అధికారులు, కాంగ్రెస్ నాయకులు రైతులు, ప్రజలను అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ఈ ప్రాంత ప్రజల ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు గ్రామాలకు వచ్చి సమస్యలను చూడడం లేదన్నారు. తమది రైతు సంక్షేమ ప్రభుత్వమని గొప్పలు చెప్పుకోవడమే తప్ప అన్నదాతలకు కాంగ్రెస్ చేసిందేమీలేదన్నారు. తమకు పరిహారం అందలేదని బాధిత రైతులు విలపిస్తున్నా మంత్రి శ్రీధర్‌బాబు పట్టంచుకోవడం లేదన్నారు.
బాధిత రైతులకు తగిన పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు మొదలు పెట్టాలని డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు బాధిత రైతుల పక్షాన బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని పుట్ట మధు హెచ్చరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు లింగంపల్లి శ్రీనివాస్‌రావు, మంథని నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు కేదారి గీతాబాయి, మాజీ సర్పంచ్‌లు ఓడేటి పద్మా రవీందర్‌రెడ్డి, నాగుల లక్ష్మారెడ్డి, టీ స్వప్నా మల్లారెడ్డి, సీనియర్ నాయకులు పెండ్యాల మనోహర్, అన్కారీ ప్రకాశ్, పోత వెంకటస్వామి, మండల యూత్ అధ్యక్షుడు ఎండీ అలీంఖాన్, కార్యకర్తలు పాల్గొన్నారు.
శాయంపేట: కాంగ్రెసోళ్లు దాడులు చేస్తుంటే ఉద్యమకారులు చూస్తూ ఊరుకోరని, వాళ్లు తలచుకుంటే కాంగ్రెసోళ్లు తట్టుకోలేరని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు. శాయంపేటలో శనివారం రాత్రి ఆయన విలేకరులతో మాట్లాడారు. భువనగిరి బీఆర్ఎస్ కార్యాలయంపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌కు అధికారమిచ్చింది ఆరు హామీ లు అమలు చేయడానికేనని, కానీ, దానిని వదిలేసి దాడులు చేయడం తగదన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదన్నారు. రాబోయేది మళ్లీ బీఆర్ఎస్ సర్కారేనని చెప్పారు.
పదేళ్లలో బీఆర్ఎస్ ఇలాంటి అరాచకాలు చేయలేదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ అంటేనే పక్కా ఉద్యమకారులమని, జైళ్లకు వెళ్లామన్నాని గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో ఎన్నోసార్లు తాను లాఠీ దెబ్బలు తిన్నానని కాంగ్రెస్ దా డులు తమకు లెక్కకాదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు భౌతికదాడులు చేస్తే ఉద్యమకారులు తిరగబడతారని, తట్టుకోలేరని హెచ్చరించారు. తాము గొంతెమ్మ కోరికలు కోరడం లేదని, మా మనసులో ఉన్నది అమలు చేయాలని అనడం లేదన్నారు.
ఎన్నికల్లో బాజాప్తా హామీలు ఇచ్చారని వాటిని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతుభరోసా విషయంలో తెలంగాణలోని ప్రతిరైతు ఆవేదన చెందుతున్నారన్నారు. ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చకపోతే ప్రజల నుంచి వ్యతిరేకత తప్పదని హెచ్చరించారు. ఫార్ములా ఈ-రేస్‌లో ఎక్కడా అవినీతి లేదని తేటతెల్లమైందన్నారు. కేవలం కేటీఆర్‌ను జైలుకు పంపాలనే కుట్రతోనే రేవంత్‌రెడ్డి కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడని ఆరోపించారు. అనంతరం సీనియర్ జర్నలిస్ట్ బాల్నే తిలక్‌బాబు కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో నాయకులు పొడిశెట్టి గణేష్, బేరుగు రాకేశ్ పాల్గొన్నారు.