న్యూశాయంపేట, సెప్టెంబర్ 29: బహుజనులు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్‌ను స్ఫూర్తిగా తీసుకొని రాజ్యాధికారం సాధించాలని గోపా వ్యవస్థాపక అధ్యక్షుడు పెరుమాళ్ల మధుసూదన్ గౌడ్ అన్నారు. హనుమ
కొండ హంటర్ రోడ్ గౌడ హాస్టల్ భవనం ఆవరణలో సోమవారం బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహానికి భూమి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 350 సంవత్సరాల క్రితమే మొగలాయి చక్రవర్తులు ఆగడాలను ఎదురించిన ధీరుడు అన్నారు. వారిపై దండయాత్ర చేసి వారి కోటాలను కోళ్లగొట్టి బహుజన రాజ్యాన్ని స్థాపించిన గొప్ప బహుజన విప్లవ వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని ప్రశంసించారు.
ఈ కార్యక్రమం లో గోపా వరంగల్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బైరి లక్ష్మీనారాయణ గౌడ్, గోపా హనుమకొండ జిల్లా అధ్యక్షులు డాక్టర్ చిర్ర రాజు గౌడ్, గోపా గ్రేటర్ జిల్లా అధ్యక్షులు పులి శ్రీనివాస్ గౌడ్, కార్పొరేటర్ పోశాల పద్మ – స్వామి గౌడ్, వరంగల్ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు తీగల జీవన్ గౌడ్, సీనియర్ జర్నలిస్ట్ పెరుమాండ్ల వెంకటేశ్వర గౌడ్, సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహ నిర్మాణ కమిటీ సభ్యులు బోనగాని యాదగిరి గౌడ్, వడ్లకొండ వేణుగోపాల్ గౌడ్, బత్తని రమేష్ గౌడ్, అంబలా సూర్య నారాయణ గౌడ్, జనగాం శ్రీనివాస్ గౌడ్, తాళ్లపెల్లి సురేష్ గౌడ్, డా. బొమ్మేర కుమార్ గౌడ్, మార్క రవి గౌడ్, జులూరి రంజిత్ గౌడ్, గట్టు నరేష్ గౌడ్, కునూరు రంజిత్ గౌడ్, బండారి జనార్దన్ గౌడ్, మాచర్ల శరత్ గౌడ్, ఆనంతుల రమేష్ గౌడ్, శ్రీపతి గోపి గౌడ్, తాబేటీ వెంకన్న గౌడ్, జనగాం వెంకటేశ్వర్లు గౌడ్, గౌని సాంబయ్య, బుర్ర శ్రీనివాస్ గౌడ్, పులి మోహన్ గౌడ్, బొమ్మగాని ఆదర్శ్ గౌడ్, శ్రీపతి రమేష్ గౌడ్ పెరుమాండ్ల అనిల్, తీగల లక్ష్మణ్ గౌడ్, పంజల జ్ఞానేశ్వర్, చిర్ర సుమన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.