హనుమకొండ చౌరస్తా, మార్చి 17 : వరంగల్ జిల్లాకు మంజూరైన విమానశ్రయానికి వారి రాణి రుద్రమదేవిగా(Rani rudramadevi) నామకరణం చేయాలని జాగృతి రాష్ట్ర నాయకురాలు మారిపెళ్లి మాధవి డిమాండ్ చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు ప్రమాణికం ఓరుగల్లు కోట అన్నార. అలాంటి ఓరుగల్లు కోటను నిర్మించి ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన కాకతీయ వంశానికి చెందిన ఆదర్శ వనిత రాణి రుద్రమదేవి అన్నారు.
అంతటి చరిత్ర కలిగిన ఆ వీరనారి పేరును మామునూరు ఎయిర్పోర్ట్కు పెట్టాలని జాగృతి సంస్థ వ్యవస్థాపక అద్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదేశాల మేరకు డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి పేరు పెట్టాలన్నారు. ఈ సమావేశంలో జాగృతి నాయకురాళ్లు నూకల రాణి, పాకనాటి మంజుల రావు, కేతరి సమ్మక్క, గుమ్మలపురం హైమావతి, నేరెళ్ల సరోజన, వీణ మాల పాల్గొన్నారు.