హనుమకొండ, మార్చి 7 : అమలుకాని హామీలు, మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగడుతామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాసర్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హెచ్చరించారు. ఎల్ఆర్ఎస్ను ఉచితంగా చేయాలని డిమాండ్ చేస్తూ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్టోబర్ 2020లో కేసీఆర్ ప్రభుత్వం ప్రజలు కొనుగోలు చేసిన భూమికి హకులు కల్పించేందుకు ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెడితే, అప్పుడు ప్రజలను రెచ్చగొట్టి తాము అధికారంలోకి రాగానే ఎల్ఆర్ఎస్ను రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పి ఇప్పుడు మాట మార్చరని ధ్వజమెత్తారు. ఎల్ఆర్ఎస్ కోసం దరఖాస్తు చేసుకొన్న 25 లక్షల 44 వేల మందిని తప్పుదోవ పట్టించారన్నారు. ఎల్ఆర్ఎస్ను విరమించుకోకపోతే దశల వారీగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, సుందర్రాజ్ యాదవ్, పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ జనార్దన్ గౌడ్, కార్పొరేటర్లు బొంగు అశోక్ యాద వ్, ఇమ్మడి లోహిత-రాజు, కో ఆర్డినేటర్ పులి రజనీకాంత్, నాయకులు ఉడుతల సారంగపాణి, నార్లగిరి రమేశ్, మట్టపల్లి రమేశ్, వేణు, సుంచు కృష్ణ, ఉమ్మడి వరంగల్ జిల్లా మైనారిటీ అధ్యక్షుడు నయీముద్దీన్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, కుసుమ లక్ష్మీనారాయణ, కేశవరెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
కాజీపేట : మహాశివరాత్రి పండుగ సందర్భంగా శివాలయాల్లో భక్తులకు అన్ని ఏర్పాట్లు చేయాలని దాస్యం సూచించారు. వడ్డేపల్లి ఉమా రామలింగేశ్వ ర స్వామి దేవాలయంలో ఏర్పాట్లను పరిశీలించారు. కార్పొరేటర్ ఎలకంటి రాములు పాల్గొన్నారు.