మహబూబాబాద్ రూరల్, డిసెంబర్ 28 : మహబూబాబాద్‌లోని అయ్యప్పస్వామి ఆలయంలో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే బానోత్ శంకర్‌నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జిల్లాలోని పలు మండలాలకు చెందిన అయ్యప్ప స్వాములు ఆలయానికి వచ్చి పూజలు చేశారు. ఈ సందర్భంగా శివాలయం నుంచి పలు కాలనీల గుండా ర్యాలీ నిర్వహించారు. ఆనవాయితీ ప్రకారం దుర్గాదేవికి పూజలు చేశారు. అగ్నిగుండంలో నుంచి ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌తోపాటు పెద్ద సంఖ్యలో అయ్యప్ప భక్తులు నడిచారు.
ప్రత్యేక నృత్యాలు, పాటల ద్వారా స్వామివారిని కొలిచారు. ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఆనందంగా జీవించాలని వారు మొక్కులు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సతీమణి సీతామహాలక్ష్మీ, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, గురుస్వామి సంజీవ్ నంబూద్రి, గద్దె రవి, చిట్యాల జనార్ధన్, బాలునాయక్, వెంకన్న తదితరులు పాల్గొన్నారు.