Road expansion work | కేసముద్రం : కేసముద్రం మున్సిపాలటీ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్నటువంటి రోడ్డు విస్తరణ పనులను శనివారం స్థానికులు అడ్డుకున్నారు. నూతనంగా ఏర్పాటు అయిన మున్సిపాలటీ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు ప్రొక్లెన్ సహాయంతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతుండగా అడ్డుకున్నారు. ఎన్ని ఫీట్ల వెడల్పుతో రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలని, 60 ఫీట్ల వెడల్పుతోనే రోడ్డు విస్తరణ పనులు చేపట్టాలని కోరారు.
వంద ఫీట్ల వెడల్పు తో రోడ్డు నిర్మించినట్లయితే రోడ్డుకు ఇరువైపులా ఉన్న నివాసితులు ఇండ్లు కొంత భాగం కోల్పోవాల్సి వస్తుందని అన్నారు. 80 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చినట్లు తెలిపారు. భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మార్కెట్ రోడ్డు లో వంద ఫీట్లతో రోడ్డు నిర్మించాలని మరి కొంత మంది కోరుతున్నారు.