Maganti Sunitha | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత పేరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను మాగంటి సునీతతో పాము ఆమె కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
మాగంటి సునీత వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీలు ఎల్ రమణ, దాసోజు శ్రవణ్, సీనియర్ నాయకులు నలమోతు భాస్కర్ రావు, దాస్యం వినయ్ భాస్కర్, జీవన్ రెడ్డితో పాటు తదితరులు ఉన్నారు.
జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా తన పేరును ప్రకటించిన అనంతరం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారిని తెలంగాణ భవన్లో కలిసి ధన్యవాదాలు తెలిపిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీత మరియు కుటుంబం.
మాగంటి సునీత గారి వెంట మాజీ మంత్రి, ఎమ్మెల్యే @BrsSabithaIndra,… pic.twitter.com/a3d0HS4gOd
— BRS Party (@BRSparty) September 26, 2025