Asia Cup : ఆసియా కప్‌లో పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత క్రికెటర్లు ‘షేక్ హ్యాండ్’ ఇవ్వకపోవడం చర్చనీయాంశమైన విషయం తెలిసిందే. లీగ్ దశలో దాయాదుల మ్యాచ్ అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) ‘పహల్గాం దాడి’ని ప్రస్తావించడంపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది పాక్ బోర్డు. దాంతో.. గురువారం టీమిండియా సారథి రిఫరీ రిచర్డ్సన్కు అయినా సరే.. ఐసీసీ నిబంధనలను ఉల్లంఘన కింద సూర్యకు మ్యాచ్ ఫీజులో30 శాతం కోత విధించాడు రిఫరీ. అయితే.. ఈ విషయాన్ని బీసీసీఐ తీవ్రంగా ఖండించింది. రిఫరీ నిర్ణయంపై అప్పీల్ చేసింది.
లీగ్ దశలో సెప్టెంబర్ 14న భారత్, పాకిస్థాన్ తలపడ్డాయి. పహల్గాం ఉగ్రదాడిని మనసులో పెట్టుకున్న సూర్య పాక్ సారథికి టాస్ సమయంలో షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. ఈ మ్యాచ్‌లో దాయాదిపై 7 వికెట్ల తేడాతో గెలుపొందింది టీమిండియా. సిక్సర్‌తో జట్టుకు విజయాన్ని అందించిన సూర్య..దూబేతో కలిసి వెనక్కి చూడకుండా డగౌట్‌కు వెళ్లిపోయాడు. అనంతరం మీడియా సమావేశంలో కెప్టెన్ మాట్లాడుతూ.. ఈ విజయాన్ని ఏప్రిల్ నెలలో పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, పాక్ ఉగ్ర స్థావరాలను నేలమట్టం చేసిన భారత సైన్యానికి అంకితం చేస్తున్నట్టు చెప్పాడు. సూర్య అలా అనడంపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది పీసీబీ.
Suryakumar Yadav has been fined 30% of his match fees as he was found guilty of breaching the code of conduct for his comments that alluded to the military skirmish between India and Pakistan, after their group match in the Asia Cup on September 14 👉https://t.co/v1Qa7243LB pic.twitter.com/CDMS3XSQpd
— ESPNcricinfo (@ESPNcricinfo) September 26, 2025
భారత్, పాక్ సూపర్ – 4 మ్యాచ్‌లో ఓపెనర్ ఫర్హాన్, హ్యారిస్ రవుఫ్ల రెచ్చగొట్టే చేష్టలపై ఐసీసీకి ఫిర్యాదు చేసింది బీసీసీఐ. అర్ధ శతకం పూర్తయ్యాక ఫర్హాన్ బ్యాట్‌తో గన్ సెలబ్రేషన్ చేసుకోవడం.. ఫీల్డింగ్ సమయంలో రవుఫ్ విమానాలను కూల్చివేతకు సంకేతంగా సంజ్ఞలు చేయడం ఏమాత్రం ఆమోదయోగ్యం కావని తమ కంప్లైంట్లో పేర్కొంది బీసీసీఐ. అంతేకాదు భారత ఇన్నింగ్స్ సమయంలో ఓపెనర్లు అభిషేక్, గిల్‌పై నోరు పారేసుకున్న రవుఫ్‌ను అంపైర్ మందలించడాన్ని కూడా భారత బోర్డు ప్రస్తావించింది. దాంతో.. శుక్రవారం ఈ ఇద్దరూ రిఫరీ ముందు హాజరయ్యారు.
ఐసీసీ నియమావళి ప్రకారం లెవల్ 1 తప్పిదానికి పాల్పడినట్టు రిఫరీ గుర్తించారు. విచారణ సమయంలో ఆరోజు మైదానంలో తాము అలా ప్రవర్తించినందుకు క్షమించాలని రిఫరీని ఫర్హాన్, రవుఫ్ కోరారు. మొదటి పొరపాటు కావడంతో ఇద్దరికీ మ్యాచ్ ఫీజులో భారీగా కోత విధించింది ఐసీసీ.