Musi River | హైదరాబాద్ : ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో పాటు జంట జలాశయాలు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నది ఉప్పొంగి ప్రవహిస్తుంది. భయంకరమైన రీతిలో నది ఉధృతంగా ఉరకలేస్తోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లోని పలు కాలనీల్లోకి వరద నీరు చేరింది. ముఖ్యంగా చాదర్‌ఘాట్ ప్రాంతంలోని మూసానగర్, శంకర్ నగర్ ప్రాంతాల్లో ఇండ్లను మూసీ వరద ముంచెత్తింది. దీంతో స్థానికులను రెవెన్యూ అధికారులు, పోలీసులు అప్రమత్తం చేశారు. పోలీసుల హెచ్చరికల నేపథ్యంలో స్థానికులు కట్టుబట్టలతో బయటపడ్డారు. కొందరు చిన్నారులు బిక్కుబిక్కుమంటూ పరుగెత్తారు. ఇప్పటికే పలు కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఇక ఈ కాలనీల్లోకి ప్రజలు ఎవరూ రాకుండా పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు.
ఎగువన కురుస్తున్న కుండపోత వర్షాలతో జంట జలాశయాలైన ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్‌కు వరద పోటెత్తిన సంగతి తెలిసిందే. దీంతో సాయంత్రం 4 గంటల వరకు ఉస్మాన్ సాగర్ 11 గేట్లు ఏడు అడుగుల మేర ఎత్తి దిగువకు 7,986 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హిమాయత్ సాగర్ ఆరు గేట్లు మూడు అడుగుల మేర ఎత్తి 6,103 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. దీంతో మూసీ నదికి వరద ఉధృతి పెరిగింది.
హైదరాబాద్‌లో ఉప్పొంగి ప్రవహిస్తున్న మూసీ
ఇండ్లల్లోకి చేరిన వరద నీరు.. కట్టుబట్టలతో పరుగు తీస్తున్న ప్రజలు
హైదరాబాద్ – హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసీ నదికి పోటెత్తిన వరద
దీంతో చాదర్ ఘాట్ ప్రాంతంలోని మూసా నగర్, శంకర్ నగర్ ప్రాంతాలలో ఇండ్లల్లోకి చేరిన వరద నీరు
పోలీసుల… pic.twitter.com/bL2PeLCv5V
— Telugu Scribe (@TeluguScribe) September 26, 2025