ఎల్కతుర్తి, ఏప్రిల్ 7: అబద్ధాలు, వైఫల్యాలు, మోసాలు.. ఇదే 16 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ పాలన అని శాసనమండలి ప్రతిపక్షనేత, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి ఎద్దేవా చేశారు. ఆది నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రజల పాలిట ఆ పార్టీ భూత, పిశాచంలా తయారైందని ఆయన మం డిపడ్డారు. ఈ నెల 27న ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న రజతోత్సవ మహాసభ ప్రాంగణంలో జరుగుతున్న ఏర్పాట్లను మాజీ ఎమ్మెల్యేలు వొడితెల సతీశ్‌కుమార్, నన్నపునేని నరేందర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మధుసూదనాచారి మాట్లాడు తూ ఈ మహాసభ చరిత్రాత్మకమన్నారు.
హామీల అమలు కోసం ప్రభుత్వం మెడలు వంచేందుకే సభ నిర్వహిస్తున్నామన్నారు. గడిచిన 25 ఏండ్లల్లో తెలంగాణ ఆత్మగౌరవం, ప్రయోజనాల విషయంలో రాజీలేని పోరాటం చేసిన ఏకైక పార్టీ బీఆర్ఎస్, అధినేత కేసీఆర్ అన్నారు. కాంగ్రెస్ అంటే తెలంగాణకు ద్రోహం చేసేందుకు పుట్టిన పార్టీ అని ఎద్దేవా చేశారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిందని, దీని అర్థం, పరమార్థం అందరూ ఆత్మగౌరవంతో బతకడ మేనన్నారు. అయితే తెలంగాణ విషయంలో మా త్రం అది కొనసాగలేదని, 1956లో ఆంధ్రాతో కలిపే సమయంలో నీళ్లు, నిధులు, ఆత్మగౌరవం కోల్పోతామని చెప్పినా వినలేదన్నారు.
మన హక్కుల కోసం పోరాడే సమయంలో ఎన్నో ఆత్మహత్యలు, అవమానాలు పడినా, వనరులు దోపిడీకి గురవుతున్నా కాంగ్రెస్ పార్టీ చలించలేదని ఆరోపించారు. తెలంగాణ ప్రజల బతుకులు, వనరుల దోపిడీలు చూసి చలించిన కేసీఆర్ 2001లో బీఆర్ఎస్ను స్థాపించి, అనేక పోరాటాల తర్వాత రాష్ర్టాన్ని సాధించుకున్నామని చెప్పారు. రాష్ట్రం వస్తే నీళ్లు, నిధులు, కరెంటు రాదని, పాలన చేతకాదని అవహేళన చేసిన పార్టీ కాంగ్రెస్ అన్నారు. అటువంటి సమయంలో పాలనా పగ్గాలు చేపట్టిన కేసీఆర్ రెండేళ్లలోనే దేశం మొత్తం రాష్ట్రంవైపు చూసేలా చేశారని పేర్కొన్నారు.
ఇటీవల శాసనమండలిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను రాష్ట్రంలో 90 లక్షల పేద మహిళలకు రూ. 2500 చొప్పున ఇవ్వలేదని, ప్రస్తుతం ప్రతి మహిళకు రూ.40 వేలు ఈ ప్రభుత్వం బాకీ ఉన్నదని ప్రశ్నించినట్లు గుర్తు చేశారు. వందేళ్ల పరిపాలన అనుభవం ఉన్న పార్టీ తమదని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు అప్పుఅప్పు అంటూ చేతులు చాస్తున్నదని విమర్శించారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.4.17 లక్షల కోట్ల అప్పు చేస్తే, కాంగ్రెస్ కేవలం 16 నెలల్లోనే కోటి 60 లక్షల అప్పు చేసిందన్నారు. కేసీఆర్ చేసిన ప్రతి అప్పు సంపద సృష్టించడానికే ఖర్చు చేశారని, కరెంటు సమస్య పరిష్కారం, తాగునీరు, కాళేశ్వరం ప్రాజెక్టు, విద్యాలయాలు, మెడికల్ కాలేజీలు, జిల్లా ల ఏర్పాటు, యాదాద్రి, సెక్రటేరియేట్, రోడ్లు, ఇలా చెప్పుకుంటే పోతే వందలాది అభివృద్ధి పనులు చేశారన్నారు.
కానీ కాంగ్రెస్ తెచ్చిన అప్పులు పర్సంటేజీలు, ఢిల్లీ పంపకాలకేనని మండిపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎక్కడ చూసినా 6 గ్యారెంటీల అమలు లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారన్నారు. హైడ్రా విధ్వంసం, మొన్న లగచర్ల, నిన్న హెచ్‌సీయూ లాంటి పాలనా వైఫల్యాలు కనపడుతున్నాయన్నా రు. కేసీఆర్ ఏదైనా పథకం మొదలుపెడితే మేథోమధనం చేసి అమలు చేసేవారన్నారు. ప్రస్తుతం తెలంగాణ అథఃపాతాళంలోకి నెట్టబడుతున్నదని, నాటి ఉద్యమ వాడీ వేడి కాంగ్రెస్ ప్రభుత్వానికి తాకేలా చూడాలన్నారు.
ఇప్పటికే 16 నెలలు ముగిశాయని, రానున్న 12 నెలలకు కూడా బడ్జెట్ ఆమోదం పొందిందన్నారు. కాంగ్రెస్‌కు ప్రజలిచ్చిన సమయం 60 నెలలని, ఇందులో 28 నెలలు పోను మిగిలింది 32 మాసాలు మాత్రమేనన్నారు. 28 నెలల కాలానికి వారిచ్చిన హామీలకు కేటాయింపులు చూస్తే 40-50 శాతం కూడా లేవన్నారు. దీనిని బట్టి చూస్తే తెలంగాణకు ద్రోహం చేయాలనేదే కాంగ్రెస్ ఉద్దేశమ ని మండిపడ్డారు. ఈ విషయాలన్ని ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర సాధకుడిగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్‌కు ఉండడంతోనే బ్రహ్మాండమైన బహిరంగ పెట్టాలని నిర్ణయించినట్లు తెలిపారు.
తెలంగా ణ అంటే అభివృద్ధి, దేశానికి దిక్సూచి అని, ఆ స్థితిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. అందువల్ల రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు లక్షలాదిగా తరలివచ్చి చైత్యాన్ని చూపాలని సిరికొండ పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, వరంగల్ మార్కెట్ మాజీ చైర్మన్ చింతం సదానందం, ప్రొఫెసర్ భాస్కర్, శోభన్బా బు, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పిట్టల మహేందర్, సొసైటీ చైర్మన్ శ్రీపతి రవీందర్‌గౌడ్, మాజీ ఎంపీపీ మేకల స్వప్న, నాయకులు ఎల్తూరి స్వామి, తంగెడ మహేందర్, కడారి రాజు, గొల్లె మహేందర్, తంగెడ నగేశ్, దేవేందర్‌రావు, హింగె శివాజీ, అల్లకొండ రాజు, మహిపాల్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, వినయ్, సతీశ్, జడ్సన్, చిట్టిగౌడ్, మదార్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పోలీసుల అనుమతి వస్తుంది. అనుమతి రాలేదనే అపోహల్లో ఎలాంటి నిజం లేదు. అనుమతి ఇచ్చేందుకు పోలీసులు కూడా సిద్ధంగా ఉన్నారు. సభ మీద పోలీసుల ఆంక్షలు లేవు. 30 యాక్టుతో ఎలాంటి ఇబ్బంది తలెత్తదు. సభకు 50 వేల వరకు వాహనాలు వస్తాయనే అంచనాతో వరంగల్-సిద్దిపేట-కరీంనగర్ రూట్లలో భారీగా పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేస్తున్నాం. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వేసవి దృష్ట్యా 10 లక్షల వాటర్ బాటిళ్లు, మజ్జిగ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచుతున్నాం. ఇటీవల జరిగిన మహా కుంభమేళాకు వచ్చినట్లు ప్రజలు లక్షలాదిగా ఈ సభకు తరలివస్తారు.
– వొడితెల సతీశ్‌కుమార్, మాజీ ఎమ్మెల్యే