హనుమకొండ, నవంబర్ 18 : బీసీ రిజర్వేషన్ల ఆమోదం కోసం అన్ని పార్టీలు, ఇతర నేతలు, సంఘాలను కలుపుకొని పోరాడుదామని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మదుసూధనాచారి పిలుపునిచ్చారు. హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో మంగళవారం జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్, మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్తో కలిసి విలేకరులతో మా ట్లాడారు. పార్టీ పరంగా రిజర్వేషన్ అమలు అనేది కాంగ్రెస్ పరాకాష్ట అన్నారు. ఆ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్ చట్టబద్ధంగా అమలు చేయాలని, లేని పక్షంలో ప్రతిఘటన తీవ్రంగా ఉంటుందని హెచ్చరించారు. బీసీల రిజర్వేషన్ల విషయంలో గతంలోనే కాంగ్రెస్ వ్యహరిస్తున్న తీరుపై న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని, కోర్టులు అడ్డుకుంటాయని ముందే చెప్పినా విని పించుకోలేదన్నారు.
కాంగ్రెస్ నాయకులు పెద్దపెద్ద మాటలు చెప్పి ఇప్పుడు పార్టీ పరంగా అమలు చేస్తా మనడం దుర్మార్గమన్నారు. 9వ షెడ్యూల్లో చేర్చడంతోనే బీసీ రిజర్వేషన్ అమలవుతుందన్నారు. బీసీలు ఏం పాపం చేశారని కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని ప్రశ్నించారు. ఎన్నికల హామీ ఏదని అడిగితే తప్పుల తడకగా కుల గణన చేసి బీసీ జనాభా తగ్గించారని, సర్వేలో తప్పులు బయటపడుతా యని వివరాలు బయట పెట్టలేదని అన్నారు. బీసీ రిజర్వేషన్ విషయంలో ఢిల్లీ స్థాయిలో ఏ ఒక్క రోజూ ఒత్తిడి తీసుకరాలేదన్నారు.
నిన్న క్యాబినెట్ సమావేశంలో పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని నిర్ణయించినపుడు బీసీ మంత్రులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. పదవుల కోసం పెదాలు మూసుకొని ఉన్నారని విమర్శించారు. ఎన్నికల కోసమే మళ్లీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చారు తప్ప బీసీలకు న్యాయం చేయాలని కాదన్నారు. తమిళనాడులో బీసీ రిజర్వేషన్ల సాధన ఒక స్ఫూర్తి అన్నారు. రిజర్వేషన్ల చట్టబద్ధత కోసం ప్రధానిని, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని, అన్ని సంఘాలను కలుపుకొని పోరాడుదామని పిలుపుని చ్చారు.
వారోత్సవాలు కాదు.. పీడోత్సవాలు
క్యాబినెట్ మీటింగ్లో కాంగ్రెస్ రెండేళ్ల పాలన వారోత్సవాలు చేస్తామని నిర్ణయం తీసుకున్నట్లు తెలి సిందని, ఏం సాధించారని చేస్తున్నారని ముధసూదనాచారి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ చేసేవి వారోత్సవాలు కావు.. అవి తెలంగాణ ప్రజల పీడోత్సవాలని అన్నారు. బీసీ రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ కుట్రలు చేస్తోందని, రేవంత్ రెడ్డిది నాలుకా తాటిమట్టనా.. మాజీ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మా ట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులు బీసీలను నమ్మించి గొంతు కోశారన్నారు.
తెలంగాణలోని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసి, ఏకాభిప్రాయంతోనే బీసీ రిజర్వేషన్ సాధించాలన్నారు. బీసీలకు రాజ్యాంగపరంగా 42 శాతం రిజర్వేషన్ సాధించే వరకు అందరం కలిసికట్టుగా పోరాడుదామని జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు అన్నారు. సమావేశంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు శోభన్, పులి రజినీకాంత్, నయీమొద్దీన్, రవీందర్రావు, జానకిరాములు, రామ్మూర్తి, జనార్దన్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.