పర్వతగిరి, నవంబర్ 16: ఆరు దశాబ్దాల వెనుకబాటును ఒక్క దశాబ్ద కాలంలోనే రూపుమాపామని బీఆర్ఎస్ పార్టీ వర్ధన్నపేట అభ్యర్థి అరూరి రమేశ్ తెలిపారు. మండలంలోని ఏబీ తండా, చింతనెక్కొండ, బట్టు తండా, తూర్పుతండా, గుగులోత్తండా, ఏనుగల్లు, మల్యాతండా, మూడెత్తుల తండా, శ్రీనగర్, కొంకపాక, గోపనపెల్లి, అనంతారం గ్రామాల్లో గురువారం ఇంటింటా ప్రచారం నిర్వహించారు. పార్టీ శ్రేణులు, మహిళలు, ప్రజలు డప్పుచప్పుళ్లు, కోలాటాలు, బతుకమ్మలు, మంగళహారతులతో అరూరికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఓట్లు అడిగే హక్కు కా్ంరగ్రెస్ లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే వారెంటీ లేని హామీలను ప్రజలు నమ్మొద్దన్నారు. 60 కాంగ్రెస్ పరిపాలనలో తాగునీరు, కరెంట్, మౌలి సదుపాయాలను ఎందుకు కల్పించలేకపోయిందో ప్రజలు ఒకసారి ఆలోచించాలన్నారు. ప్రస్తుతం ఆచరణకు సాధ్యం కాని హామీలతో ఓట్లు దండుకోవాలని చూస్తున్న కాంగ్రెస్‌కు ఈ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. బీఆర్ఎస్ పార్టీ మ్యానిఫెస్టోతో ప్రజలకు భరోసా అని తెలిపారు.
కారుగుర్తుకు ఓటు వేసి తనను మరోసారి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. ఎంపీపీ కమల పంతులు, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి కర్మిళ్ల బాబురావు, పీఏసీఎస్ చైర్మన్ మోటపోతుల మనోజ్‌కుమార్‌గౌడ్, గొర్రె దేవేందర్, మార్కెట్ డైరెక్టర్ పట్టాపురం ఏకాంతంగౌడ్, సర్పంచులు ప్రమీలా, గటిక సుష్మా, సంధ్యారాణి, సుజాత, జ్యోతి లకుపతి, రమేశ్, మహేశ్, తౌటి దేవేందర్, పార్టీ మండల అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్, మాజీ జడ్పీటీసీ మేడిశెట్టి రాములు, పంతులు, మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ బోయినపెల్లి యుగేందర్‌రావు, సీఏ కొయ్యల రాజు, మాజీ ఎంపీపీలు రంగు రజితగౌడ్, వల్లందాసు రంగయ్య, భాస్కర్‌రావు, మధుసూదన్‌రావు, ఎంపీటీసీలు మౌనిక, సుభాషిణి, లావణ్యరావు, బూక్య భాస్కర్, కర్మిళ్ల మోహన్‌రావు, బీఆర్ఎస్ మండల యూత్ అధ్యక్షుడు గూడ నరేందర్వర్మ, రైతు విభాగం మండల అధ్యక్షుడు బాల్య వెంకటరాజు గౌడ్ పాల్గొన్నారు. చింతనెక్కొండ, ఏనుగల్లు గ్రామాల్లో అరూరికి గజమాలతో ఘనంగా సత్కరించారు.
పర్వతగిరి/కాశీబుగ్గ, నవంబర్ 16: బీఆర్ఎస్లోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. పర్వతగిరి మండలం దౌలత్‌నగర్ మాలోత్ కాంతమ్మ (కాంగ్రెస్), గోపనపెల్లి ఎంపీటీసీ సూర రమేశ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అభ్యర్థి అరూరి రమేశ్ గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. పార్టీ పరిశీలకుడు నాగుర్ల వెంకటేశ్వర్లు, సర్పంచ్ వెంకటేశ్వర్లు, ఉపసర్పంచ్ సూర అశోక్ పాల్గొన్నారు.
గ్రేటర్ వరంగల్ 14వ డివిజన్ ఎస్ఆర్ నగర్‌కు చెందిన 50 మంది కాంగ్రెస్ నాయకులు గురువారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఏనుగల్లు శివారులోని శ్రీఅభయాంజనేయ స్వామి ఆలయ సమీపంలో వర్ధన్నపేట బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అరూరి రమేశ్ గులాబీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఎమ్మెల్యే అరూరి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రజలు బీఆర్ఎస్ను విశ్వసిస్తున్నారన్నారు. చేరిన వారిలో ఎస్కే హఫీజ్, రమేశ్, శంషోద్దీన్, ఎండీ రబ్బానీ, షేక్ ఖదీర్‌తో పాటు 40 మంది ఉన్నారు. డివిజన్ అధ్యక్షుడు ముడుసు నరసింహా, నాయకులు కేతిరి రాజశేఖర్, అమ్మరాజు కుమార్, మచ్చర్ల స్టాలిన్, ఆడేపు అశోక్, ప్రభాకర్, బండ్ల సురేందర్ ఉన్నారు.