బయ్యారం జూన్ 13: బయ్యారం చెరువు కాలువల శాశ్వత మర్మతు పనులు వెంటనే చేపట్టాలని, బయ్యారం చెరువుకు గోదావరి జలాల నీళ్లు ఇవ్వాలని కోరుతూ సీపీఐ (ఎంఎల్) నిడమోక్రసీ, సీపీఎం,సీపీఐ, సీపీఐ (ఎంఎల్ ) మాస్ లైన్ పార్టీల ఆధ్వర్యంలో బయ్యారం ప్రభుత్వ హాస్పిటల నుంచి బస్టాండ్ సెంటర్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సెంటర్లోని జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాకతీయులు నిర్మించిన బయ్యారం పెద్ద చెరువు అభివృద్ధికి నోచుకోవడం లేదని విమర్శించారు. వర్షాకాలం సీజన్ ప్రారంభమైంది అయినా ఇంతవరకు చెరువు కాలువలు, తూములు రిపేరు చేయకుండా శిథిలావస్థలో ఉన్నాయి.
బయ్యారం చెరువు తూములు వదిలితే నీళ్లు ప్రతి సంవత్సరం నిరుపయోగంగా పోతున్నాయనీ, చెరువు తెగిన సందర్భంలో తెగిన కట్టను పోయడం తప్ప అభివృద్ధి చేయకపోవడం సిగ్గుచేటు అన్నారు.
ఏజెన్సీ ప్రాంతం గుండా పారుతున్న గోదావరి నీళ్లు మన తలాపన ఉన్నాయని చెప్పుకోవడమే తప్ప ఆంధ్ర వలస వాదులు మరొకసారి జలదోపిడీకి పాల్పడుతున్నారని అన్నారు. మంత్రులు భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు ముగ్గురు మంత్రులు బయ్యారాన్ని ఎడారి ప్రాంతంగా చేసేటందుకు కుట్రచేస్తున్నారని వారు తీవ్రంగా విమర్శించారు. గోదావరి జలాలు బయ్యారం చెరువుకు అందించాలని వారు డిమాండ్ చేశారు.
లేని పక్షంలో భవిష్యత్తులో దశల వారీగా ఆందోళన చేయబడతామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ (ఎంఎల్ ) మహబూబాద్ డివిజన్ కార్యదర్శి నందగిరి వెంకటేశ్వర్లు, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మండ రాజన్న, సీపీఐ నాయకులు కలింగ రెడ్డి,సీపీఐ(ఎంఎల్) మండల కార్యదర్శి బిల్లకండి సూర్యనారాయణ, నాయకులు రామగిరి బిక్షం, నంబూరి మధు, తుడుం వీరభద్రం, నేతకాని రాకేష్, రామచంద్రుల మురళి, తోకల వెంకన్న, ఏపూరి వీరభద్రం, అంగిరేకుల నాగేశ్వరరావు, చంటి,జక్కుల యాకయ్య, పూజల లచ్చయ్య, మంగీలాల్, సంఘన్న, వీరబోయిన ఐలయ్య, తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు.