Ustaad Bhagat Singh | నెగెటివ్ ప్రచారం చేస్తే చర్యలు తప్పవు.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’పై బెంగళూరు కోర్టు సంచలన తీర్పు!
Ustaad Bhagat Singh | పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది.
Pawan Kalyan Movie | పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంపై సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేస్తూ బెంగళూరు సిటీ సివిల్ అండ్ సెషన్స్ కోర్టు సంచలన తీర్పును వెల్లడించింది. ఈ సినిమా గురించి అభ్యంతరకరమైన, కించపరిచే లేదా తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా ఉండేందుకు ‘జాన్ డో’ (John Doe) ఇంజక్షన్ ఉత్తర్వులను జారీ చేస్తూ న్యాయమూర్తి జీవనరావు వసంతరావు కులకర్ణి ఆదేశాలు జారీ చేశారు. సినిమా విడుదలకు ముందు కొంతమంది వ్యక్తులు కావాలని నెగెటివ్ ప్రచారం చేస్తూ బాక్సాఫీస్ కలెక్షన్లను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారంటూ చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు ఈ మేరకు స్పందించింది.
ఈ కోర్టు ఉత్తర్వుల ప్రకారం ఎక్స్, యూట్యూబ్, ఫేస్బుక్, మెటా వంటి సామాజిక మాధ్యమాలతో పాటు బుక్‌మైషో, ఐఎండీబీ వంటి ప్లాట్‌ఫారమ్‌లలో సినిమా ప్రతిష్టను దిగజార్చే కంటెంట్‌ను ప్రసారం చేయడంపై నిషేధం ఉంటుంది. సాధారణంగా వ్యక్తుల పేర్లు తెలియని పక్షంలో అజ్ఞాత యూజర్లందరినీ ఉద్దేశించి జారీ చేసే ఈ ‘జాన్ డో’ ఆర్డర్ వల్ల అభ్యంతరకర పోస్టులను ఆయా సంస్థలు వెంటనే తొలగించాల్సి ఉంటుంది. ఈ స్టే ఆర్డర్ తదుపరి విచారణ జరిగే ఏప్రిల్ 27 వరకు అమలులో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఉగాది కానుకగా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రంలో శ్రీలీల, రాశి ఖన్నా కథానాయికలుగా నటించగా, దేవి శ్రీ ప్రసాద్ మరియు థమన్ సంగీతాన్ని అందించారు.
ఏమిటీ ‘జాన్ డో’ (John Doe) ఇంజక్షన్?
సాధారణంగా ఎవరైనా తప్పు చేస్తే వారి పేరు మీద కేసు వేస్తారు. కానీ, ఇంటర్నెట్లో వేల సంఖ్యలో అజ్ఞాత వ్యక్తులు (Anonymous users) తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు వారి పేర్లు తెలియవు. అటువంటి సందర్భాల్లో, గుర్తుతెలియని వ్యక్తులందరినీ ఉద్దేశించి జారీ చేసే ముందస్తు నిషేధాజ్ఞలనే ‘జాన్ డో’ ఆర్డర్ అంటారు. దీనివల్ల సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు అటువంటి అభ్యంతరకర పోస్ట్‌లను వెంటనే తొలగించాల్సి ఉంటుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
మోరంపల్లిబంజర్‌లో ముమ్మరంగా పట్టభద్రుల ఓటరు నమోదు అవగాహన
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
ధనవంతుడైన వ్యాపారవేత్తగా నటించి.. 20 మంది మహిళా కానిస్టేబుల్స్‌ను మోసగించిన వ్యక్తి
MLA KP Vivekananda | నీళ్లన్నీ వృధాగా పోతున్నయ్.. మేం కళ్లారా చూసినం : ఎమ్మెల్యే కేపీ వివేకానంద
Vaibhav Sooryavanshi: నిరాశపరిచిన సూర్యవంశీ.. ఇండియా 70/5
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

