Pakistan | 11 రోజులకే ముడిచమురు, 9 రోజులకే ఎల్పీజీ.. తీవ్ర ఇంధన సంక్షోభంలో పాకిస్థాన్
Pakistan | పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) తీవ్ర ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో కేవలం 11 రోజులకు సరిపడా ముడిచమురు (Crude Oil) నిల్వలు మాత్రమే ఉండటం ఇంధన భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రాచ్యం (Middle East) లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది.
Pakistan : పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) తీవ్ర ఇంధన సంక్షోభంలో చిక్కుకుంది. దేశంలో కేవలం 11 రోజులకు సరిపడా ముడిచమురు (Crude Oil) నిల్వలు మాత్రమే ఉండటం ఇంధన భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రాచ్యం (Middle East) లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని ఓ నివేదిక వెల్లడించింది. పెట్రోలియంపై ఏర్పాటైన సెనేట్ స్టాండింగ్ కమిటీకి అధికారులు ఈ వివరాలు అందించారు.
దేశంలో ప్రస్తుతం 21 రోజులకు సరిపడా డీజిల్, 27 రోజులకు పెట్రోల్, 9 రోజులకు ఎల్పీజీ, 14 రోజులకు విమాన ఇంధనం నిల్వలు ఉన్నాయని పెట్రోలియం కార్యదర్శి తెలిపారు. పాకిస్థాన్ తన పెట్రోలియం అవసరాల్లో దాదాపు 70 శాతం మధ్యప్రాచ్యం నుంచే దిగుమతి చేసుకుంటోంది. తాజా ఘర్షణల కారణంగా కీలకమైన నౌకా మార్గాలు దెబ్బతిన్నాయి. ఎర్ర సముద్రం మీదుగా సరుకు రవాణాకు గతంలో 4-5 రోజులు పట్టగా, ఇప్పుడు 12 రోజులు పడుతోంది.
మరోవైపు పాకిస్థాన్‌లో గ్యాస్ సంక్షోభం కూడా పొంచి ఉంది. ఏప్రిల్ 14 తర్వాత దేశంలో తీవ్రమైన ద్రవీకృత సహజ వాయువు (LNG) కొరత ఏర్పడుతుందని అధికారులు హెచ్చరించారు. మార్చిలో రావాల్సిన ఎనిమిది ఎల్ఎన్జీ కార్గోలలో కేవలం రెండే పాకిస్థాన్‌కు చేరాయి. ఈ సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు పాక్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హర్మూజ్ జలసంధి ద్వారా చమురు రవాణాకు అనుమతి కోసం ఇరాన్‌తో చర్చలు జరుపుతున్నది.
పరిస్థితిని సమీక్షించేందుకు ప్రభుత్వం ప్రతిరోజూ ఇంధన నిల్వలపై సమీక్ష నిర్వహిస్తున్నది. ప్రస్తుతానికి మార్చి నెలకు సరిపడా నిల్వలు ఉన్నాయని, ఏప్రిల్ మధ్య వరకు సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

