లింగాల ఘనపురం : జనగామ జిల్లాలో మరో భద్రాద్రిగా పేరుగాంచిన జీడికల్ శ్రీ వీరాచల రామచంద్రస్వామి దేవాలయం( Jeeidical temple lands) పరిధిలో గల జనగామ, యాదాద్రి భువనగిరి జిల్లాలోని పలు గ్రామాల్లో గల భూములను కౌలుకు వేలం చేపడుతున్నట్టు ఈవో వంశీ తెలిపారు. జీడికల్ లోగల 70 ఎకరాల భూమికి. కళ్లెం. గుమ్మడవెల్లి గ్రామాల్లో గల ఆరు ఎకరాల భూమికి యాదాద్రి భువనగిరి జిల్లా కొల్లూరు లో గల రెండెకరాల భూమికి ఈనెల 4న ఆయా గ్రామాల్లో వేలం నిర్వహిస్తున్నామన్నారు.
అలాగే యాదాద్రి భువనగిరిలో గల అనంతరం. వెల్మజాల. అంబాల లో గల ఐదు ఎకరాల భూమికి ఈనెల ఐదున వేలం చేపడుతున్నామన్నారు. జనగామ జిల్లాలో గల బండ్లగూడెం చిన్నమడూరు గ్రామాల్లో గల ఐదు ఎకరాల భూమికి ఈనెల 6న వేలం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Virat Kohli | మరో రికార్డుకు చేరువైన విరాట్ కోహ్లీ.. ఇంతకీ ఆ రికార్డు ఏంటంటే..?
FedEx plane | పక్షిని ఢీకొట్టిన విమానం.. ఇంజిన్లో మంటలు.. అత్యవసర ల్యాండింగ్