Virat Kohli | చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఆదివారం న్యూజిలాండ్‌తో తలపడనున్నది. భారత జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ మరిన్ని రికార్డులపై కన్నేశాడు. పాకిస్తాన్‌పై సెంచరీతో కోహ్లీ పలు రికార్డులను నెలకొల్పాడు. కివీస్‌పై పలు రికార్డులు సాధించేందుకు రెడీగా ఉన్నాడు. కివీ జట్టుపై మరికొన్ని పరుగులు చేస్తే.. న్యూజిలాండ్‌పై 3వేలు అంతకన్నా ఎక్కువ పరుగులు చేసిన ఐదో బ్యాట్స్‌మెన్‌గా కోహ్లీగా నిలువనున్నాడు. కోహ్లీ 85 పరుగులు చేసిన వెంటనే న్యూజిలాండ్‌పై మూడు వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు. దాంతో సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, జాక్ కాలిస్, జో రూట్ సరసన నిలువనున్నాడు.
టీమిండియా దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్ న్యూజిలాండ్‌పై అంతర్జాతీయ క్రికెట్లో 3,345 పరుగులు చేశాడు. జాక్ కలిస్ 3,071 పరుగులు చేయగా.. జో రూట్ 3,068 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌పై 55 మ్యాచుల్లో విరాట్ 2,915 పరుగులు చేశాడు. ఇందులో తొమ్మిది సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలున్నాయి. చివరిసారిగా కోహ్లీ న్యూజిలాండ్‌తో వన్డే ఆడినప్పుడు 2023 వన్డే ప్రపంచకప్ సెమీఫైనల్లో 117 పరుగులు చేశాడు. ఆ సమయంలో వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన సచిన్ రికార్డును అధిగమించారు. వన్డేల్లో విరాట్ 50వ సెంచరీ సాధించాడు. సచిన్ 49 సెంచరీల రికార్డును అధిగమించి 50వ సెంచరీ చేశాడు. దాంతో పాటు కోహ్లీ న్యూజిలాండ్‌పై వన్డేల్లో భారత బ్యాట్స్‌మన్‌గా అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచే అవకాశం ఉంది. కోహ్లీ మరో 105 పరుగులు చేస్తే న్యూజిలాండ్‌పై అత్యధిక పరుగులు చేసిన భారత ప్లేయర్‌గా నిలువనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్నది. 42 మ్యాచ్‌ల్లో 1,750 పరుగులు చేశాడు.
ఇందులో ఐదు సెంచరీలు, ఎనిమిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి. మొత్తంమీద, న్యూజిలాండ్‌పై వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన రికార్డు రికీ పాంటింగ్ పేరిట ఉంది. 51 మ్యాచ్‌ల్లో 1,971 పరుగులు చేశాడు. ఇక విరాట్ గతకొంతకాలంగా విరాట్ ఫామ్ లేమితో ఇబ్బందిపడుతూ వచ్చాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి ముందు నుంచి పరుగులు చేయడంలో ఇబ్బందులుపడుతూ వస్తున్నాడు. చాంపియన్స్ ట్రోఫీకి ముందు మూడో వన్డేల్లో హాఫ్ సెంచరీ చేశాడు. బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో లెగ్ స్పిన్నర్ రిషద్ హుస్సేన్ బౌలింగ్‌లో తక్కువ స్కోర్‌కే కోహ్లీ తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫుల్ ఫామ్‌లోకి తిరిగి వచ్చాడు. పాక్‌పై 100 పరుగులు చేసి.. భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది.