Reflection Photography | వాన వెలిసిన తర్వాత వాతావరణం ఆహ్లాదకరంగా మారుతుంది. ఈ సమయం.. ఫొటోగ్రఫీకి అనుకూలంగా ఉంటుంది. ఇక రోడ్లపై నిలిచిన వాననీటిలో.. భవనాలు, చెట్ల ప్రతిబింబాలు ప్రత్యేకంగా కనిపిస్తుంటాయి. వాటిని కెమెరాల్లో బంధించడమే.. ‘రిఫ్లెక్షన్ ఫొటోగ్రఫీ’. నీళ్లు, గాజు, అద్దాలు, పాలిష్ చేసిన ఉపరితలాలను ఉపయోగిస్తూ.. అద్భుతమైన చిత్రాలు తీసే సృజనాత్మక కళ. మొబైల్ ఫోన్‌తో.. ప్రొఫెషనల్ గేర్ అవసరం లేకుండానే.. అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫొటోలను తీయవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌ని ఉపయోగించి రిఫ్లెక్షన్ ఫొటోగ్రఫీలో నైపుణ్యం సాధించడానికి కావాల్సిన చిట్కాలు, పద్ధతులను ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం.
పోర్టబుల్ : ఎక్కడికైనా సులభంగా తీసుకెళ్లవచ్చు. ఆకస్మికంగా ఫొటో తీయాలనుకుంటే.. వెంటనే జేబులోంచి తీసి ‘క్లిక్’ అనిపించొచ్చు.
ఫాస్ట్- ఫ్లెక్సిబుల్ : మొబైల్ కెమెరాలతో లైటింగ్, యాంగిల్స్‌ను త్వరత్వరగా అడ్జస్ట్ చేసుకోవచ్చు.
క్రియేటివ్ యాంగిల్స్ : స్మార్ట్ఫోన్లను వాడటం చాలా సులువు. రిఫ్లెక్షన్ ఫొటోగ్రఫీలో ఎక్కువగా ‘లో యాంగిల్’.. అంటే కింద కూర్చుని ఫొటోలు తీయాల్సి ఉంటుంది. అలాంటి సమయంలో స్మార్ట్‌ఫోన్ కంఫర్ట్‌గా ఉంటుంది. దీని సాయంతో క్లోజ్-అప్ షాట్లను సులభంగా తీయవచ్చు.
ప్రొ టిప్ : మరింత డ్రమాటిక్ రిఫ్లెక్షన్ ఫొటోల కోసం మంచి అల్ట్రా-వైడ్‌లెన్స్ ఉన్న మొబైల్ ఫోన్‌ని ఉపయోగించండి.
నీరు (సరస్సులు, నీటి కుంటలు, కొలనులు) : గుట్టలు, కొండలకు సహజసిద్ధమైన రిఫ్లెక్షన్స్ అందిస్తాయి.
గ్లాస్ కిటికీలు, ఆకాశ హర్మ్యాలు : నగరాలు, భవనాల ప్రతిబింబాలను అద్భుతంగా చూపిస్తాయి.
అద్దాలు : పోర్ట్రెయిట్లు, సృజనాత్మక కంపోజిషన్స్ కోసం ఉపయోగపడతాయి.
మెరిసే భవనాలు, టైల్స్ : ఇండోర్ సెట్టింగ్‌లలో ఇల్యూజన్స్ కోసం పనికొస్తాయి.
కారు ఉపరితలాలు, మెటల్ వస్తువులు : వీటిలో నగర దృశ్యాలు, వీధుల ప్రతిబింబింబాలను మరింత అందంగా ఫొటోలు తీయొచ్చు.
ప్రొ టిప్ : వర్షం తర్వాత రోడ్లపై నిలిచే నీరు.. అందమైన ప్రతిబింబాలను సృష్టిస్తాయి. కాబట్టి.. వర్షం వెలిశాక తడి వీధుల్లో విహరించండి. అద్భుతమైన ఫొటోలను తీయండి.
ఫోకస్ : మీకు కావాల్సిన రిఫ్లెక్షన్ ఆబ్జెక్ట్ స్పష్టంగా ఉండేలా చూసుకోండి.
ఎక్స్పోజర్ : ఫొటోలు ఓవర్ ఎక్స్పోజ్ కాకుండా ఉండేందుకు ఎక్స్పోజర్ను అడ్జస్ట్ చేయండి.
హెచ్డీఆర్ మోడ్ : అధిక కాంట్రాస్ట్ ఉండే ప్రాంతాలలో.. లైట్స్, షాడోస్ని బ్యాలెన్స్ చేసేందుకు హెచ్డీఆర్ మోడ్‌ను ఉపయోగించండి.
గ్రిడ్ లైన్లు : రిఫ్లెక్షన్లను సమరూపంగా అమర్చడంలో ఇవి సహాయపడతాయి.
అల్ట్రా వైడ్ మోడ్ : ఈ మోడ్.. దృశ్యాన్ని మరింత విస్తరిస్తుంది. ప్రతిబింబాలను మరింత నాటకీయంగా మారుస్తుంది.
గోల్డెన్ అవర్ : సూర్యోదయం, సూర్యాస్తమయంలో ఉండే మృదువైన లైటింగ్.. ప్రతిబింబాల అందాన్ని పెంచుతుంది.
బ్లూ అవర్ : సూర్యాస్తమయం తర్వాత మెరుస్తున్న నగర లైట్లతో.. అర్బన్ రిఫ్లెక్షన్స్‌ను అద్భుతంగా బంధించొచ్చు.
మేఘాలు : ఆకాశంలో దట్టంగా కమ్ముకునే మేఘాలు.. ప్రకృతిని కొత్తగా చూపిస్తాయి. రిఫ్లెక్షన్లు ఓవర్ ఎక్స్పోజర్ కాకుండా చూస్తాయి.
నైట్ రిఫ్లెక్షన్స్ : నగరాల్లో నదులు, సరస్సుల (మూసీ, హుస్సేన్‌సాగర్)లో కనిపించే భవనాలు, సిటీ లైట్లు, నియాన్ రిఫ్లెక్షన్లను క్యాప్చర్ చేయండి.
ప్రొ టిప్ : క్రియేటివ్ నైట్ రిఫ్లెక్షన్స్ కోసం కృత్రిమ లైట్లను (వీధిదీపాలు, నియాన్ సంకేతాలు) ఉపయోగించండి.
మొబైల్ ఫోన్‌తో అద్భుతమైన రిఫ్లెక్షన్ ఫొటోగ్రఫీని ఆస్వాదించండి. మరింత క్రియేటివ్‌గా ఆలోచిస్తూ.. విభిన్న ఉపరితలాలు, లైటింగ్, యాంగిల్స్‌తో సరికొత్త ప్రయోగాలు చేయండి. ప్రత్యేకంగా కనిపించే, కంటికి ఆకట్టుకునే కంపోజిషన్స్ని సృష్టించండి.
– ఆడెపు హరికృష్ణ