ఆదివాసీ ప్రాంతమైన ములుగు జిల్లాలో పేదలు, మధ్యతరగతి ప్రజలకు జబ్బు చేస్తే మొదట ప్రభుత్వ దవాఖాన వైపే చూస్తారు. అక్కడ ఉచిత వైద్యం, మందులు, పెద్ద డాక్టర్లు, సకల సౌకర్యాలు ఉంటా యనే నమ్మకంతో వస్తుంటారు. కానీ అలాంటి ఆస్పత్రిలో సరిపడా వసతులు, మిషన్లు మరమ్మతుకు గురై టెస్టులు లేక ప్రైవేట్‌ను ఆశ్రయిస్తున్నారు. టాయిలెట్లు సరిగా లేక ముక్కు మూసుకుంటున్నారు. చిన్నపాటి వానకే హాస్పిటల్ భవనం కురుస్తుండడంతో పేషెంట్లు భయాందోళన చెందుతున్నారు.
– ములుగు రూరల్, సెప్టెంబర్ 25
పెద్దాసుపత్రిగా పేరుగాంచిన ములు గు జిల్లా దవాఖానలో కనీస సౌకర్యా లు లేక పేషెంట్లు ఇబ్బందులు పడుతున్నారు. టీ డయాగ్నొస్టిక్ సెంటర్లో ఉన్న డెంగీ నిర్ధారణ పరీక్షల మిషన్ గత రెండు వారాలుగా పనిచేయక పోవడంతో రోగులు ప్రైవేటు ల్యాబ్‌లను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. దీంతో ఆర్థికంగా వారు అవస్థలు పడుతున్నారు.
నిత్యం రోగులతో కిటకిటలాడుతున్న పెద్దాసుపత్రిలో టా యిలెట్లు సరిగా లేకపోవడంతో రోగు లు ముక్కు మూసుకోవాల్సి వస్తున్నది. సూపరింటెండెంట్ ప ట్టించుకోకపోవడంతో సిబ్బంది శుభ్రం చేయడం లేద ని ఆరోపణలు వినవస్తున్నాయి. టా యిలెట్ల పక్కనే పరీక్షలు, ఆ పక్కనే గర్భిణులకు వైద్య పరీక్షలు చేస్తుండడంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతూ కాటన్ క్లాత్‌లు, మాస్క్‌లు ముక్కుకు కట్టుకుంటున్నారు.
కురుస్తున్న హాస్పిటల్ భవనం
రెండు రోజులుగా కురుస్తున్న ముసురు వానకు దవాఖాన భవనం కురుస్తున్నది. ఆపరేషన్ థియేటర్ సమీపంలో, ఫస్ట్ ఫ్లోర్ వద్ద మూడు, నాలుగు చోట్ల నీళ్లు కారుతున్నాయి. భవనం పైకప్పులో చీరికలు ఉన్న కారణంగా వర్షపు నీరు లోపలికి వస్తుంన్నది. దవాఖానలో టైల్స్ ఉన్న కారణంగా వచ్చే పోయే రోగులు వర్షపు నీరును గమనించకుండా అడుగు వేస్తే జారి కింద పడే ప్రమాదం ఉండడంతో సిబ్బంది బకెట్లు పెట్టారు.
భవనం పైకప్పుతో పాటు భీమ్ల నుంచి వర్షపు నీరు కురుస్తున్నది. బకెట్లలో పడిన వ ర్షపు నీటిని సిబ్బంది బయటకు పారబోస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక మంత్రి, కలెక్టర్ స్పందించి దవా ఖానలో సమస్యలను పరిష్కరించడంతోపాటు డెంగ్యూ నిర్ధారణ పరీక్షల యంత్రానికి మరమ్మతులు చేపట్టి టెస్టులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.