హనుమకొండ, నవంబర్ 17: కొంతమంది యూనివర్సిటీతో సంబంధంలేని వారు యూనివర్సిటీ ప్రతిష్టను దిగజార్చే విధంగా ప్రైవేటు విద్యాసంస్థలు, హాస్పటల్ దగ్గర యూనివర్సిటీ జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులమని చెప్పుకుంటూ దందాలు చేస్తూ చందాలు వసూలు చేస్తున్నారు. అలాంటి వారిని ఎవరు నమ్మకూడదని, అలాంటి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని కేయూ జేఏసీ నాయకులు హెచ్చరించారు. కాకతీయ యూనివర్సిటీలోని గెస్ట్‌హౌస్‌లో సోమవారం జరిగిన సమావేశంలో విద్యార్థుల సమస్యల పరిష్కారాలకు ఐక్యంగా పోరాటాలు నిర్వహించడం కోసం కాకతీయ యూనివర్సిటీ నూతన విద్యార్థి జేఏసీని ఎన్నుకున్నట్లు వారు ప్రకటించారు.
కేయూ జేఏసీ చైర్మన్ ఆరేగంటి నాగరాజ్, వైస్ చైర్మన్ కేతపాక ప్రసాద్, కన్వీనర్ కందికొండ తిరుపతి, కో-కన్వీనర్ అల్లం విజయ్, ప్రధాన కార్యదర్శి బోస్కా నాగరాజ్, కార్యదర్శి జనగాం రాజారాం, కోశాధికారి రేగుల నరేష్, సహాయ కార్యదర్శి సూర్యకిరణ్, జాయింట్ ట్రెజరర్ చింత ఆంజనేయులు, కమిటీ సభ్యులుగా పోతర్ల మహేష్, జీడీ సుమన్, బానోత్ రాజ్‌కుమార్, శ్రీదేవి, స్రవంతిలను ఎన్నుకున్నట్లు వారు తెలిపారు.