ములుగు రూరల్, మార్చి 25 : ములు గు జిల్లాలో మక్కజొన్న పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని, విత్తన సంస్థల నుంచి పరిహారం అందే లా చూస్తుందని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి హామీ ఇచ్చారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో మక్కజొన్న విత్తన వైఫల్యంపై ఆయన రైతు విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేశ్రెడ్డి, సభ్యులు రాంరెడ్డి, గంగాధర్, నర్సింహారెడ్డి, వెంకన్నయాదవ్తో కలిసి స్థానిక అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముందుగా జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మక్కజొన్న విత్తన వైఫల్యంపై చేపట్టిన చర్యలను వివరించారు. జిల్లాలో మొ త్తం 959 మంది రైతులు సాగుచేసిన 2,161 ఎకరాల్లోని మక్కజొన్న పంటకు నష్టం వాటిల్లిందన్నారు. విత్తన కంపెనీలు రైతుల బ్యాం కు ఖాతాల్లో నష్టపరిహారం డబ్బులు జమచేసేలా ఆదేశాలు జారీచేశామని తెలిపారు.
రైతుల ఆరోగ్య విషయంలో జిల్లా వైద్యాధికారి ఆధ్వర్యంలో కమిటీ వేసి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రైతు ప్రతినిధులు మాట్లాడుతూ నష్టపోయిన మక్కజొన్న రైతులకు పరిహారం చెల్లించాలని, అధిక వడ్డీ రుణాలను నిరోధించాలని, రైతులకు ఏ విధమైన ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు. అనంతరం కోదండరెడ్డి మాట్లాడుతూ పలు స్వల్ప, దీర్ఘకాలిక పరిష్కార మార్గాలతో రైతులను అన్ని విధాలా ఆదుకుంటామని, అధైర్యపడొద్దన్నా రు. బహుళ జాతి సంస్థలు విచ్చల విడిగా రైతులతో విత్తనోత్పత్తి చేయించి అన్నదాతల ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారని అన్నారు. ములుగు జిల్లాలో జరిగిన సంఘటనలు తెలి సి నిపుణుల కమిటీని వేశామన్నారు.
బాధిత రైతులు, కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు, అన్ని శాఖల అధికారులతో చర్చించిన అనంతరం కమిషన్ ద్వారా ఒక నిర్థిష్టమైన పాలసీని రూపొందించి రాష్ట్రం మొత్తానికి వర్తింపజేసేలా ప్రభుత్వానికి అందజేస్తామన్నారు. బహుళ జాతి కంపెనీలు రైతులను మోసం చేసిన విషయం బట్టబయలైందన్నారు. ఆదివాసీ ప్రాంతంలో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యక్రమాలు అడుగడుగునా కమిషన్ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని త్వరలోనే నిపుణులు, మేధావులతో చర్చించి శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వాన్ని వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ కోరనున్నదని కోదండరెడ్డి తెలిపారు. సమీక్షలో ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రామిశ్రా, అదనపు కలెక్టర్లు మహేందర్జీ, సంపత్రావు, ఆర్డీవో వెంకటేశ్, సలహాదారులు నర్సింహారెడ్డి, రామాంజనేయులు, సుచరిత, విత్తన కంపెనీల ప్రతినిధులు, ఆర్గనైజర్లు, రైతులు పాల్గొన్నారు.
ఏటూరునాగారం, మార్చి 25 : మక్కజొన్న విత్తన కంపెనీ దళారులపై వాజేడు, వెంకటాపురం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాత్రి ఏఎస్పీ శివం ఉపాధ్యాయ వివరాలు వెల్లడించారు. వెంకటాపురం మండలం యోగిత నగ రం గ్రామానికి చెందిన రైతు పాయం రాం బాబు హైటెక్ కంపెనీ దళారీ మన్యం సురేశ్ వద్ద మక్కజొన్న విత్తనాలు కొనుగోలు చేసి నాలుగెకరాల్లో విత్తగా రూ.5 లక్షలు నష్టం వచ్చింది. అధిక దిగుబడులు వస్తాయని సురే శ్ చెప్పడంతో అతని మాటలు నమ్మి మోసపోయినట్లు రాంబాబు ఫిర్యాదు చేశాడు. అదేవిధం గా వాజేడు మండలం పూసూరు గ్రామానికి చెందిన రైతు జాడి రాంబాబు తొమ్మిది ఎకరాల్లో బేయర్ కంపెనీకి చెందిన విత్తనాలు సాగు చేసి నష్టపోయాడు. మంగపేట మండ లం తిమ్మంపేటకు చెందిన చిలకమారి వేణు అధిక దిగుబడి వస్తుందని నమ్మించడంతో విత్తనాలు తీసుకుని సాగు చేయగా రూ.7 లక్షల నష్టం రావడంతో జాడి రాంబాబు ఫి ర్యాదు చేశాడు. దీంతో సురేశ్, వేణుపై కేసులు నమోదు చేసినట్లు ఏఎస్పీ తెలిపారు.