KERALA IGP |వరంగల్ చౌరస్తా: వరంగల్ నగరంలోని గోవిందరాజస్వామిని కేరళ ఐజిపి లక్ష్మణ్, కేరళ పాలక మున్సిపాలిటీ డెవలప్మెంట్ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ మినీ మోల్ శనివారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి ఘనంగా స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం ఆలయంలో కాలభైరవ ఉప ఆలయంలో ప్రత్యంగిర చండీయాగం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు జగన్నాథం, కిరణ్, స్వామి, వారియోగుల శ్రీకాంత్, స్వామి, వేణు స్వామి, వరియోగుల వేణు మాధవస్వామి, రామస్వామి తదితరులు పాల్గొన్నారు.