నాయకులు, కార్యకర్తల మధ్య ఎలాంటి విభేదాలు ఉండొద్దని, చిన్నచిన్న మనస్పర్థలున్నా వాటిని వీడి పార్టీ గెలుపు కోసం సమన్వయంతో పనిచేద్దామని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కార్యకర్తలకు సూచించారు. బుధవారం పాలకుర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే విజయపథం వైపు నడిపిస్తాయని పేర్కొన్నారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టోతో పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. పాలకుర్తిలో ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కదన్నారు.
పాలకుర్తి రూరల్, అక్టోబర్ 25: విభేదాలను వీడి కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణా భివృద్ధి, నీటి సరఫరాల శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు సూచించారు. బుధవారం మండ ల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో మండలస్థా యి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహాయ సహాకారాలతో పాలకుర్తి నియోజకవర్గా న్ని అభివృద్ధిలో ప్రగతి పథంలో ఉంచానని, అభి వృద్ధే ధ్యేయంగా పనిచేశానని అన్నారు. పాలకుర్తి లో ప్రతిపక్షాలకు డిపాజిట్ దక్కదన్నారు. సర్వేల ప్రకారం తాను సుమారు 60వేల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. పాలకుర్తి మండ లంతో పాటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానన్నారు. ప్రతి గ్రామంలో గల్లీగల్లీకి సీసీతో పాటు డబుల్ రోడ్లను వేయించానన్నారు. డబుల్ బెడ్రూం ఇళ్లు నిర్మించి ఇచ్చామన్నారు. బీఆర్ఎస్ సంక్షేమ పథకాలే పార్టీని విజయపథం లో నడిపిస్తాయన్నారు.
సీఎం కేసీఆర్ మూడో సారి ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదన్నారు. బీఆర్ ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోతో ప్రజల్లో పార్టీకి ఆదరణ పెరిగిందన్నారు. ప్రతి గ్రామంలో మెజారి టీ రావాలన్నారు. పాలకుర్తి అభివృద్ధిని చూసి బీఆ ర్ఎస్లోకి వలసల జోరు సాగుతోందన్నారు. పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలు పునిచ్చారు. మండలంలోని తిరుమలగిరి గ్రామం నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్య కర్తలు మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ఖాళీ అవు తోందన్నారు. మంత్రి వారికి కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వోనించారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన సింగపురం పుష్పగిరి, శ్రీనివాస్, యాకమ్మ, శ్యాం, గాదరి నర్స ఎల్లయ్య, ఈర్ల మహేశ్, గాదరి నవీన్ మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్య క్షుడు పసునూరి నవీన్, జడ్పీటీసీ పుస్కూరి శ్రీని వాసరావు, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి మాచర్ల ఎల్లయ్య, జడ్పీ కో ఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్, జిల్లా రైతుబంధు సమితి సభ్యుడు జర్పు ల బాలునాయక్, గ్రామశాఖ అధ్యక్షుడు కూటి కంటి పరశురాములు, ప్రధాన కార్యదర్శి కౌడగాని సుధాకర్, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ డైరెక్టర్ ఈర్ల రాజు, గాదరి పెద్దాపురం పాల్గొన్నారు.
తొర్రూరు: మండలంలోని పెద్దమంగ్యా తండా కు చెందిన కాంగ్రెస్ యూత్ నాయకులు 70 మంది మంత్రి ఎర్రబెల్లి సమక్షంలో బుధవారం బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చీకటాయపాలెం గ్రామానికి చెందిన సాధు చంద్ర య్య, తమ్మి మల్లికార్జున్, పల్లె సుమన్, మేర కృష్ణ, పొడిశెట్టి సంపత్, బాలగాని రాజు, పల్లపు యాకయ్య, ఓరుగంటి కుమార్ బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రస్తుత ఎన్నికల్లో పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. భారీ మెజార్టీ కోసం కృషి చేయాలని మంత్రి సూచించారు. పార్టీలోకి చేరిన వారికి తగి న గుర్తింపు, గౌరవం కల్పిస్తామన్నారు.