స్టేషన్ ఘన్పూర్/వేలేరు, ఫిబ్రవరి 11 : స్టేషన్ ఘన్‌పుర్ ఉప ఎన్నిక ఖాయమని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు తెలంగాణ ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని.. ఆ ఎన్నికలో కడి యం శ్రీహరి ఓడిపోయి రాజ య్య ఎమ్మెల్యేగా గెలుస్తాడని తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. మంగళవా రం ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్‌ను మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో పాటు ఉమ్మడి ధర్మసాగర్ మాజీ జడ్పీటీసీ, పీచర గ్రామానికి చెందిన కీర్తి వెంకటేశ్వర్లు, వేలేరు మండల కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మల్కిరెడ్డి రాజేశ్వర్‌రెడ్డి కేసీఆర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ నెల 15న తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం నుంచి సుమారు వెయ్యి మందితో కలిసి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. కాగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ టికెట్ కడియం శ్రీహరికి ఇవ్వడం తో అసహనంతో వెంకటేశ్వర్లు, రాజేశ్వర్‌రెడ్డిలు కాంగ్రె స్ పార్టీలో చేరి ఇప్పుడు సొంత గూటికి వచ్చినట్లు తెలిపారు.
త్వరలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గానికి ఉపన్నిక వస్తుందని మళ్లీ గులాబీ జెండా ఎగరడం ఖా యమని కేసీఆర్ చెప్పినట్లు పేర్కొన్నారు. అక్రమ కేసులతో 15 రోజులుగా జైల్లో ఉన్న నియోజకవర్గ బీఆర్ఎస్ కో ఆర్డినేటర్ కేశిరెడ్డి మనోజ్‌రెడ్డికి కేసీఆర్ ధైర్యం చెప్పి తన సహకారం ఎప్పుడూ ఉంటుందని చెప్పార ని రాజయ్య తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో కడియం శ్రీహరి ఆగడాలు, నియోజకవర్గ పరిస్థితులను కేసీఆర్‌కు వివరించినట్లు తెలిపారు.