కాజీపేట అక్టోబర్ 6: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఇల్లు కూలిన బాధితులకు ప్రభుత్వం తరఫున సహాయం అందజేస్తామని కాజీపేట మండల తహశీల్దార్ బావ్ సింగ్ హామీ ఇచ్చారు. పట్టణంలోని 47వ డివిజన్ పరిధి బాబూజీ నగర్ బూడిదగడ్డ ప్రాంతంలో ఆదివారం కురిసిన వర్షానికి కూలిన నద్దునూరి కళావతి ఇంటిని సోమవారం నాడు ఆయన పరిశీలించారు. బాధితుల స్థితిగతుల గురించి ఆరా తీశారు.
అనంతరం తహశీల్దార్ బావ్ సింగ్ మాట్లాడుతూ.. వర్షంతో ఇల్లు కూలిన అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. వర్షంతో ఇల్లు కూలిన నదునూరి కళావతికి ప్రభుత్వం తరఫున త్వరలోనే నగదు రూ.7500, 50 కిలోల బియ్యం అందజేస్తామని పేర్కొన్నారు.