హనుమకొండ చౌరస్తా, ఏప్రిల్ 3 : కడియం శ్రీహరి అవకాశవాది అని, ఆయన కూతురు కావ్యను చిత్తుగా ఓడించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. బుధవారం హనుమకొండ ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల సమావేశంలో ఆయన మా ట్లాడారు. కడియం శ్రీహరి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడని, మాదిగ జాతి కోసం ఆయన ఒరగబెట్టింది ఏమీలేదని, పక్కవాళ్లు ఎదిగితే జీర్ణించుకోలేడని అన్నా రు. కుల్లు, కుతంత్రాలతో తాటికొండ రాజయ్య, అరూరి రమేశ్, పసునూరి దయాకర్ రాజకీయ ఎదుగుదలను శ్రీహరి అడ్డుకున్నాడని ఆరోపించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఆయన మాత్రమే ఎదిగాడని, ఇప్పుడు తన బిడ్డ ఎదుగుదలకు పునాదులు వేస్తున్నాడని అన్నారు. టీడీపీలో ఉన్నప్పుడు మోతుపల్లి నర్సింహులును ఎదగకుండా ప్రయత్నం చేశాడన్నారు. ఒక పార్టీ నుంచి టికె ట్ తెచ్చుకొని మళ్లీ వేరే పార్టీ మారడం చరిత్రలో లేదన్నా రు. గతంలో నక్సలైట్లు చంపేస్తారని తెలిసి కడియంను కాపాడడానికి తమ ప్రాణాలను అడ్డం పెట్టామన్నారు.
కానీ, ఆయన టీడీపీ, బీఆర్ఎస్లో చేరి దళితులకు నమ్మకద్రోహం చేశాడన్నారు. కడియం మాదిగ ఉపకులం బైండ్ల కూడా కాదన్నారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేసేందు కు కుట్ర పన్నాడని ఆరోపించారు. బీజేపీలో అవకాశాలున్నా మాదిగ జాతి కోసం తాను టికెట్ తీసుకోవ డం లేదని మంద కృష్ణ అన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన చంద్రబాబును విమర్శించి బీఆర్ఎస్లో చేరిన కడి యం, ఇప్పుడు బీఆర్ఎస్ ఓడిపోయాక పకనే ఉండకుండా కాంగ్రెస్‌లో చేరాడని, అతడికి నీతి నిజాయి తీ లేదన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు లేకుండా ఆయనకు బీఆర్ఎస్లో టికెట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఏ మాదిగ నాయకుడు కడి యం కోసం ప్రచారం చేయవద్దని పిలుపునిచ్చారు. రేవంత్‌రెడ్డి రెడ్డిలకు మాత్రమే టికెట్లు ఇస్తున్నాడని, కాంగ్రెస్ పార్టీ బీసీలు, మాదిగలను అణగదొకే ప్రయత్నం చేస్తోందన్నారు. ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు మందకుమార్ తదితరులు పాల్గొన్నారు.