హనుమకొండ, సెప్టెంబర్ 04 : కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ ప్రకారం దివ్యాంగులకు రూ.6వేలు, చేయూత పెన్షన్ దారులకు రూ. 4వేలకు పెంచడంతో పాటు కండరాల క్షీణతతో మంచానికి పరిమితమైన వికలాంగులకు రూ.15వేల పించన్ పెన్షన్ ఇవ్వాలని, లేని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్ధం చేస్తామని ఎంఆర్పిఎస్ హనుమకొండ జిల్లా ఇన్చార్జి కందుకూరి సోమన్న మాదిగ హెచ్చరించారు. గురువారం హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయ హోటల్లో ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు గద్దల సుకుమార్ మాదిగ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఉపరాష్ర్టపతి ఎన్నిక ఉన్నందున ఈనెల 9న జరుగే చలో హైదరాబాద్ కార్యక్రమం వాయిదా వేయడం జరిగిందని అన్నారు.
పింఛన్లు పెంచే వరకు కాంగ్రెస్ ప్రభుత్వంతో ప్రత్యక్ష యుద్దంలో భాగంగా పద్మశ్రీ మంద కృష్ణ కార్యాచరణ రూపొందించారని, అందులో భాగంగా ఈనెల 8న పింఛన్దారులతో కలిసి కలెక్టరేట్ ముట్టడిస్తామని తెలిపారు. ఈనెల 20 న హైదరాబాద్ నుండి మొదలుకొని కోదాడ వరకు జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని హెచ్చరించారు. హనుమకొండ జిల్లా పరిధిలోని ప్రతి గ్రామంలోని వికలాంగులు, చేయూత పెన్షన్ దారులు కాంగ్రెస్ పార్టీతో ప్రత్యక్ష యుద్దానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మాదిగ యువసేన జాతీయ నాయకులు చాతల్ల శివ మాదిగ , వికలాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు సింగారపు స్వామి మాదిగ, ఎంఎస్పి పార్టీ జిల్లా సీనియర్ నాయకులు అక్కెనకుంట వెంకటస్వామి మాదిగ, జిల్లా ఉపాధ్యక్షులు రాజారపు బిక్షపతి మాదిగ, మాట్ల వెంకటస్వామి మాదిగ, జిల్లా కార్యదర్శులు తిప్పరపు మల్లేశం మాదిగ, శనిగరపు రవీందర్ మాదిగ, విహెచ్పిఎస్ జిల్లా నాయకులు పోలేపాక ప్రభాకర్ మాదిగ, వీహెచ్పీఎస్ మహిళ నాయకురాలు సింగారపు రజిత, బోయిని సంపత్ ముదిరాజ్, గోవిందు రవి కుమార్ మాదిగ, చింత అశోక్ మాదిగ, బొక్క రాజేష్ మాదిగ, నద్దునూరి రఘు మాదిగ, సొంపెల్లి అన్వేష్ మాదిగ, తుడుం వెంకటేష్ మాదిగ, ఆయా మండలాల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి విహెచ్పిఎస్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.