కాజీపేట, నవంబర్ 4: దక్షిణ మధ్య రైల్వే జోనల్ పరిధిలోని రైల్వే కార్మికుల సమస్యల పరిష్కారమే రైల్వే మజ్దూర్ యూనియన్ ధ్యేయమని ఏఐఆర్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్, దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్ అన్నారు. కాజీపేట రైల్వే జంక్షన్లో మంగళవారం కోల్కతాలో వారం రోజులపాటు జరిగే సమావేశానికి తరలి వెళుతున్న రైల్వే మజ్దూర్ యూనియన్ నేతలకు పలువురు యూనియన్ నాయకులు పూలమాలలు, శాలువాతో సన్మానించి వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ జోనల్ అధ్యక్షుడు కాల్వ శ్రీనివాస్ మాట్లాడుతూ..భారతీయ రైల్వేలో దీర్ఘకాలంగా ఉన్న రైల్వే కార్మికుల సమస్యలను కలకత్తాలో జరిగే వర్కింగ్ కమిటీ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకో నున్నట్లు తెలిపారు. రైల్వే మజ్దూర్ యూనియన్ ఎల్లప్పుడు రైల్వే కార్మికులకు అండగా ఉంటుందన్నారు. యూనియన్ కార్మికుల సమస్యల పరిష్కారానికికు నిరంతరం కృషి చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే మజ్దూర్ యూనియన్ నాయకులు వేద ప్రకాష్, రాజేందర్, గిరిమెట్ల రాజేశ్వరరావు, నరేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.