లింగాలఘనపురం, నవంబర్ 15 : సీఎం కేసీఆర్‌తోనే గ్రామాలు సుభిక్షంగా ఉన్నాయని, ఈ నేపథ్యంలోనే నెల్లుట్లకు జాతీయ స్థాయి అవార్డు ల భించిందని ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి పేర్కొన్నారు. మండలంలోని నెల్లుట్లలో ఆమె బు ధవారం ఇంటింటా ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించి సీఎం కేసీఆర్‌కు కానుకగా అందించాలన్నారు. ఆ సంఖ్యను చూసి ప్రతిపక్షాలకు కళ్లుబైర్లు కమ్మాలన్నారు. అసలీ మండలం లో కాంగ్రెస్, బీజేపీలకు ఉనికే లేదన్నారు. ఆ పార్టీ లు అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో ప్రజలు అనే క అవస్థలు పడుతున్నారన్నారు. ఆరు పథకాల హామీ అంటూ ప్రచారం చేస్తున్న కాంగ్రెస్‌ది బస్మాసుర హస్తమన్నారు. ప్రజలు నమ్మి మోస పోవద్దన్నారు. నూతనంగా అధికారంలోకి వచ్చిన కర్టాక రాష్ట్రంలో ఏ హామీ అమలు కావడంలేదన్నారు. అక్కడి జనం కాంగ్రెస్ మోసపూరిత వాగ్దానాలు నమ్మి నేడు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఆ పరిస్థితిని చేజేతులా మన రాష్ర్టానికి తేవొద్దని ప్రజలను కోరారు. సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీ రామ రక్ష అన్నారు.
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి అ మలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి యువ త ఆకర్షితులవుతున్నారని జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి అన్నారు. లింగాలఘనపురానికి చెందిన వివిధ పార్టీలకు చెందిన యువత బుధవారం నెల్లుట్లలోని బీఆర్ఎస్ కార్యాలయ ఆవరణలో చేరగా, వారికి పార్టీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్‌ఘన్‌పూర్ బీఆర్ఎస్ అభ్యర్థ్ది, ఎమ్మె ల్సీ కడియం శ్రీహరిని భారీ మెజార్టీతో గెలిపించేందుకు యువత అహర్నిశలు శ్రమించాలన్నారు. ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు మోటె వీరస్వామి, గుర్రం యాదగిరిగౌడ్, కొత్తకొండ గోవర్ధన్, గొరిగె పద్మ, కడకంచి కావ్య, పేరబోయిన కుమార్, కొయ్యడ చంద్రయ్య, సోమయ్య, మల్లయ్య, రిజ్వాన్, పాషా, బొల్లంపెల్లి నాగేందర్, ఎండీ జానీమియా, కాటం కుమారస్వామి, ఎడ్ల రాజు, బోయిని జంపన్న, లింగాల ఆదిత్య, కేమిడి యాదగిరి, కొత్తకొండ గంగాధర్, గాదెపాక విష్ణు, శ్రీ హరి పాల్గొనగా.. ఎల్ చంద్రశేఖర్, ఈ కార్త్తీక్, ఈ క్రాంతికుమార్, పీ రమేశ్, ఎన్ శ్రీకాంత్, కే అనిల్, బీ రాజు, డీ హరిప్రసాద్, ఈకృష్ణ, జీ క్రాంతి బీఆర్ఎస్లో చేరారు.
స్టేషన్‌ఘన్‌పూర్: తొమ్మిదేళ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధితో పాటు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే వచ్చే కష్టాలను మండలంలోని ప్రతి గ్రామం లో గడప, గడపకూ తిరుగుతూ బీఆర్ఎస్ శ్రేణు లు ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నారు. బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ అభ్యర్థ్ది, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి, ఎమ్మెల్యే రాజయ్య సూచనల మేరకు.. బుధవారం నుంచి మూడు రోజుల పాటు గడప గడపకూ బీఆర్ఎస్ కార్యక్రమాన్ని బీఆర్ఎస్ శ్రే ణులు, ప్రజాప్రతినిధులు ప్రచారం నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా బుధవారం మండలంలోని శివునిపల్లి గ్రామంలో మండల పార్టీ అధ్యక్షుడు మాచర్ల గణేశ్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు బూర్ల శంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ శ్రేణులు మూడు గ్రూపులుగా గ్రామంలో ప్రచారం నిర్వహించారు. గడప గడపకూ తిరుగుతూ బీఆర్ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టోను అందిస్తూ కాంగ్రెస్ మా య మాటలను నమ్మి కాంగ్రెస్‌కు ఓటు వేస్తే కరెం టు, దళిత బంధు, బీసీ బంధు, రైతు బంధు, రైతుబీమా, కల్యాణ లక్ష్మి వంటి సంక్షేమ పథకాలు క నుమరుగు అవుతాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే అభివృద్ధే లక్ష్యంగా, నిజాయితీగా పాలన అందించే కడియం శ్రీహరి నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే కా కుండా, నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాడన్నారు. కడియంను భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రజలను కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రా మంలో ప్రచారానికి ప్రజల స్పందన బాగుందని, బీఆర్ఎస్ మద్దతు తెలుపుతూ అన్ని వర్గాల ప్రజలను ఆదుకుంటున్న బీఆర్ఎస్కే ఓటు వేస్తామని ప్రజలు అంటున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుర్రం రాజు, సొసైటీ డైరెక్టర్ తోట సత్యం, మార్కెట్ డైరెక్టర్ సరిత, గ్రామ అధ్యక్షుడు బాలరాజు, మాజీ ఎంపీటీసీ ఫాతికుమార్, మాజీ ఉప సర్పంచ్‌లు పిట్టల మల్లయ్య, గుర్రం శ్రీను, రాజశేఖర్, రాజు, అమ్జద్ పాష, కుమ్మం రాజు, గుర్రం శంకర్, అశోక్, భిక్షపతి, శ్రీను, చిట్టిబాబు, మధు, రమేశ్, నాగరాజు పాల్గొన్నారు.
జఫర్‌గఢ్: బీఆర్ఎస్ స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి కారు గుర్తుకు ఓటు వేయాలని మండలంలోని తమ్మడపల్లి(ఐ)లో గురువారం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి గ్రామాభివృద్ధి కమిటీ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు గాదెపాక సుధాకర్‌బాబు ముఖ్య అతిథిగా హాజరు కాగా, గ్రామంలో ప్రచారాన్ని జోరు గా సాగించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోపై రైతులు, పెన్షనర్లు, మహిళలు, యువకులకు అవగాహన కలిగించగా, అన్ని వర్గాల ప్రజలు తమ హర్షాన్ని తెలిపారు. గ్రామంలోని ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్కరూ ప్రచార కార్యక్రమానికి స్వచ్ఛందంగా తర లి వచ్చి తమ ఓటు కారు గుర్తుకే అంటూ ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొన్నారు. అనంతరం సు ధాకర్బాబు మాట్లాడుతూ బీఆర్ఎస్ను తిరిగి అ ధికారంలోకి తీసుకువచ్చి సీఎంగా కేసీఆర్‌ను ఎమ్మెల్యేగా కడియం శ్రీహరిని గెలిపించుకునేందు కు తామందరం కారుగుర్తుకే ఓటు వేయాలన్నా రు. లక్ష ఓట్ల మెజార్టియే లక్ష్యంగా ప్రతి కార్యకర్త కృషి చేయాలని సుధాకర్‌బాబు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కుల సంఘాల బాధ్యులు, మహిళలు పాల్గొన్నారు.