వరంగల్, జూన్ 25(నమస్తే తెలంగాణ)/మహబూబాబాద్ రూరల్ : వరంగల్, మహబూబాబాద్ ఎంపీలుగా ఎన్నికైన కడియం కావ్య, బలరాం నాయక్ మంగళవారం ఢిల్లీలో పార్లమెంట్ భవనంలో ప్రమాణ స్వీకారం చేశారు. కడియం కావ్య అను నేను.. అంటూ తెలుగులో ప్రారంభించి జై భీం, జై భద్రకాళి, సేవ్ కాన్సిట్యూషన్ అంటూ ప్రమాణ స్వీకారం చేశారు. తమ ప్రాంతాలను అన్ని విధాలా అభివృద్ధి చేయాలని, నిరుపేదలందరికీ సంక్షేమ ఫలాలు అందించాలని ప్రజలు ఆకాంక్షించారు.