పరకాల, అక్టోబర్ 30 : నయవంచనకు కేరాఫ్ కాంగ్రెస్ పార్టీ అని, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను నిమ్మితే నట్టేట ముంచుతాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని గీసుకొండ మండలం దస్రూ తండా, నందనాయక్ తండాకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులతోపాటు, ఆత్మకూరు మండలం గుడెప్పాడ్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు హనుమకొండలోని ఎమ్మెల్యే నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో 60 ఏండ్లు పాలించిన కాంగ్రెస్ వల్ల తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడిందన్నారు. మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తూ ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుందన్నారు. అందరి సంక్షమమే కేసీఆర్ లక్ష్యమన్నారు. ఆయన పాలనలో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతోందన్నారు. కాంగ్రెస్, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ర్టాల్లో తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను ఎందుకు అమలు చేస్తలేరో ప్రశ్నించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రం మరింత అభివృద్ధి కావాలంటే మళ్లీ కేసీఆరే సీఎం కావాలన్నారు. కాగా, పార్టీలో చేరిన వారిలో ఆత్మకూరు మండల మైనార్టీ అధ్యక్షుడు ఎండీ జానీ, బలభద్ర నవీన్, ఆరెల్లి నాగరాజు, గీసుకొండ మండలానికి చెందిన బాదావత్ గణేశ్, బాదావత్ బాలు, బానోత్ వెంకన్న, భూక్యా బాలు, హాలావత్ రాజు, హాలావత్ వీరన్న, హాలావత్ రమేశ్, నరేందర్, సునీల్, విజయ్, హేమంత్, పూర్ణచందర్, అఖిల్, గణేశ్, వెంకన్న, రమేశ్, సంతోష్, రాజు, ఓంకార్, నర్సింహ ఉన్నారు. కార్యక్రమంలో ఆయా మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు