పరకాల: రాజీయే రాజ మార్గమని, జాతీయ లోక్ అదాలత్ ద్వారా పెండింగ్లో ఉన్న పలు కేసులను పరిష్కరించినట్లు పరకాల కోర్టు జడ్జి సీహెచ్ శ్రావణ స్వాతి అన్నారు. జాతీయ లోక్ అదాలత్ను పురష్కరించుకుని పట్టణంలోని కోర్టు ఆవరణలో పలు కేసులకు రాజీ కుదిర్చారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాజీ మార్గంతో ఇరు వర్గాలకు సత్వరన్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. లోక్ అదాలత్లో భాగంగా పెండింగ్లో ఉన్న కేసులను పరిష్కరించినట్లు తెలిపారు. రాజీ ద్వారా రెండు వర్గాలకు సత్వర న్యాయం అందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీలు రుధిర, కుమార్, లోక్ అదాలత్ సభ్యులు వెంకటరమణ, రవికుమార్, ఏసీపీ సతీష్ బాబు, డివిజన్ పరిధిలోని పోలీసులు, న్యాయవాదులు పాల్గొన్నారు.