కలెక్టర్ భవిశ్ మిశ్రా
కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం పరిశీలన
ఉపాధ్యాయ సిబ్బందికి పలు సూచనలు
టేకుమట్ల, మార్చి 9 : విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీయాలని కలెక్టర్ భవిశ్ మిశ్రా సూచించారు. బుధవారం ఆయన మండలంలోని అంకుషాపూర్ శివా రులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థులను లెక్కలు అడిగి, వారికి సులభతరంగా ఎలా నేర్చుకోవాలో విద్యా ర్థులకు భోదించాడు. విద్యార్థులకు సులభంగా బోధించే పద్ధతులను ఉపాధ్యా యులకు తెలిపారు. సర్పంచ్ పండుగ శ్రీను, స్పెషల్ ఆఫీసర్ స్వప్న పాఠశాలలోని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందిచిన కలెక్టర్ వాటర్ ప్లాంట్ ఏర్పా టు, ఫర్నీచర్, విద్యుత్ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. అనంతరం మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో సర్పంచ్‌లో సమీక్ష నిర్వహించా గ్రామాల్లో చేసిన అభివృద్ధి పనులు చేపట్టే పనులను అడిగి తెలసుకున్నారు. ఎం పీడీవో కార్యాలయం కోసం రూ.20 లక్షలు మంజురు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి, జడ్పీటీసీ పులి తిరుపతిరెడ్డి, ఎంపీడీవో అనిత, తహసీల్దార్ షరీఫ్ మోయినుద్దీన్, వైస్ ఎంపీపీ ఐలయ్య, సర్పంచ్ ఫోరం మండలాధ్యక్షుడు మహేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు సట్ల రవి, సర్పంచ్‌లు సరోతత్తంరెడ్డి, మహేశ్, ఉమేందర్రావు పాల్గొన్నారు .
ఆడిట్ అభ్యంతరాల సమాధానాలు 28లోగా పంపాలి : కలెక్టర్ కృష్ణ ఆదిత్య
ములుగుటౌన్: జల్లా అడిట్ సమావేశంలో అభ్యంతరాల సమాధానాలు ఈ నెల 28లోగా పంపించాలని కలెక్టర్ కృష్ణ ఆదిత్య సూచించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా స్థ్ధాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీ కార్యాదర్శులు, మండల అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ, మార్కెటింగ్ కా ర్యదర్శులు, దేవాలయ కార్యదర్శులు, పం చాయతీ కార్యదర్శులు, అడిట్ అ భ్యంతరాలుంటే సమాధానాలు ఈనెల 28 వరకు పూర్తి చేసి పంపాలన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠీ మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి పెండింగ్‌లో ఉన్న అడిట్ రికవరీ ఆన్లైన్లో నమోదు చేయాలని ఇంకా పెండింగ్‌లో ఉంటే ఆర్థ్ధిక చట్టం ప్రకారం త్వరగా పూర్తి చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డీపీవో వెంక య్య, జిల్లా ఆడిట్ సహాయకులు ఎన్. రమేశ్, సీనియర్ అసిస్టెంట్ ధీరజ్ రెడ్డి, జడ్పీసీఈవో రమాదేవి, పలు మండలాల ఎంపీడీవోలు, ఎంపీవోలు, కార్యదర్శులు పాల్గొన్నారు.