ట్రైనీ ఐఏఎస్ అధికారులు
పర్వతగిరి, రాయపర్తి, ఖానాపురం, నల్లబెల్లి మండలాల్లో పర్యటన
పర్వతగిరి, మార్చి 9 : మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని ట్రైనీ ఐఏఎస్ అధికారులు అన్నారు. బుధవారం కల్లెడ జీపీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. స్త్రీలకు పురుషులతో సమానంగా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు ఉన్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లునావత్ కమల, సర్పంచ్ సంపెల్లి శోభ, సర్వర్, వైస్ ఎంపీపీ ఎర్రబెల్లి రాజేశ్వర్‌రావు, ఎంపీడీవో చక్రాల సంతోష్ కుమార్, ఎంపీవో శ్రీనివాస్, ఏపీఎం కృష్ణమూర్తి, కార్యదర్శి మాధవుడు తదితరులు పాల్గొన్నారు.
మెగా పార్కు పరిశీలన..
రాయపర్తి : మండల కేంద్రం శివారులో నూతనంగా ఏర్పాటు చేస్తున్న బృహత్ పల్లె ప్రకృతి వనం (మెగా పార్కు)ను ట్రైనీ ఐఏఎస్ అధికారులు సందర్శించారు. బృహత్ పల్లె ప్రకృతి వనం ఏర్పాటు ఆవశ్యకత-వెచ్చించిన నిధులు, చేపడుతున్న అభివృద్ధి పనులపై ఎంపీడీవో గుగులోత్ కిషన్‌నాయక్, ఎంపీ వో తుల రామ్మోహన్, రాయపర్తి, తిర్మలాయపల్లి గ్రామాల సర్పంచ్‌లు, గారె నర్సయ్య, గజవెల్లి అనంత ప్రసాద్‌తో చర్చించారు. శిక్షణ అధికారులు నవేంద్ శేఖర్, వినోద్‌కుమార్ మీనా, హిమంత్ సింగ్ ఉజ్వల్, ఇంద్ర బదన్ ఝా, ప్రత్యుష్ కుమార్ పాండే, జీపీ కార్యదర్శి గుగులోత్ అశోక్‌నాయక్, ఈజీఎస్ సిబ్బంది యాకూబ్‌నాయక్, కొండేటి రాజు తదితరులు పాల్గొన్నారు.
పాఠశాలల సందర్శన..
ఖానాపురం : అశోక్‌నగర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీ, అంగన్వాడీ కేంద్రాలను ట్రైనీ ఐఏఎస్‌లు పరిశీలించారు. విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కార్యక్రమంలో సర్పం చ్ కవిత, వైస్ ఎంపీపీ రామసహాయం ఉమారాణి, కార్యదర్శి అబేదా పాల్గొన్నారు.
నల్లబెల్లిలో..
నల్లబెల్లి : మండలంలోని పలు గ్రామాల్లో జరిగిన అభివృద్ధి పనులను ట్రైనీ ఐఏఎస్ అధికారులు పరిశీలించారు. రాంపూర్, కన్నారావుపేట, నందిగామలో జరిగిన పనులపై ఎంపీడీవో విజయ్‌కుమార్, ఎంపీవో కూచన ప్రకాశ్‌ను అడిగి తెలుసుకున్నారు.