ఖమ్మం రూరల్, ఫిబ్రవరి 14 : మహా శివరాత్రి సందర్భంగా తీర్థాల జాతర (శ్రీ సంగమేశ్వర స్వామి ఆలయం) కు విచ్చేసే భక్తులు ట్రాఫిక్ /పార్కింగ్ ఏర్పాట్లను తప్పనిసరిగా పాటించగలరని ఖమ్మం పోలీస్ కమిషనరేట్ విజ్ఞప్తి చేసింది. ఇందుకు సంబంధించిన రూట్ మ్యాప్, పార్కింగ్ ఏరియాల వివరాలను ఖమ్మం రూరల్ పోలీస్ స్టేషన్ సీఐ ముష్కరాజ్ శనివారం విడుదల చేశారు.
1.ఖమ్మం పట్టణం వైపు నుండి వచ్చే వాహనాలు దానవాయిగూడెం – రామన్నపేట – కామంచికల్ మీదుగా వచ్చి కామంచికల్ మున్నేరు వాగు బ్రిడ్జి సమీపంలో రోడ్డు ఇరువైపుల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో ఆర్టీసీ బస్సులు, ద్విచక్ర వాహనాలు, కార్లు, ఆటోలు పార్కింగ్ చేసుకోవాలి.
2.ట్రాక్టర్లు, లారీలు కామంచికల్ – పాటివారి గూడెం – జాన్బాద్ తండా మార్గం ద్వారా వెళ్లి కామంచికల్ బ్రిడ్జి వద్ద ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో పార్కింగ్ చేయాలి.
3.ఖమ్మం నుండి వచ్చే వాహనాలు కామంచికల్ గ్రామ ప్రవేశం వద్ద స్కూల్ దారి నుండి వెంచర్ ప్రక్క మార్గం ద్వారా తీర్థాలకు వెళ్లాలి.
4.డోర్నకల్, పాపటిపల్లి వైపు నుండి వచ్చే వాహనాలు కామంచికల్ గ్రామానికి ముందు చెరువు వద్ద కుడి వైపు ఉన్న జామాయిల్ తోట దారి ద్వారా కామంచికల్ వైపు వచ్చి నది ఎడమ వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు నిలపాలి.
5.మద్దివారిగూడెం, మంగళగూడెం వైపు నుండి వచ్చే వాహనాలు తీర్థాల గ్రామ ప్రవేశం వద్ద ఇరువైపుల ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు నిలపాలి.
6.కురవి, ములకలపల్లి వైపు నుండి వచ్చే ఆటోలు, ట్రాక్టర్లు యం.వి.పాలెం – గుండాల తండా మార్గం ద్వారా వచ్చి తీర్థాల గ్రామ ప్రవేశం వద్ద కుడి వైపు ఉన్న క్వారీ దారి ద్వారా గుడి ఎదురుగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాలి.
7.ఖమ్మం రూరల్ వైపు నుండి వచ్చే ద్విచక్ర వాహనాలు మరియు కార్లు పల్లెగూడెం – గోళ్ళపాడు మార్గం ద్వారా వచ్చి మామిడి తోటకు ముందు ఎడమ వైపు తిరిగి ఆకేరు బ్రిడ్జి దాటి గుడి ఎదురుగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు నిలపాలి.
8.ములకలపల్లి క్రాస్ రోడ్ నుండి వచ్చే ట్రాక్టర్లు, ఆటోలు, ట్రాలీలు, లారీలు, డీసీఎంలు పల్లెగూడెం Y జంక్షన్ నుండి ఎ.వి.పాలెం Y జంక్షన్ వరకు గూడూరుపాడు గ్రామం మీదుగా వెళ్లి వారికి కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలో వాహనాలు పార్కింగ్ చేయాలి.
9.ములకలపల్లి జంక్షన్ (మహబూబాబాద్ క్రాస్ రోడ్) నుండి పల్లెగూడెం Y జంక్షన్ – పోలపల్లి – గొల్లపాడు మార్గం ద్వారా కేవలం కార్లు మరియు ద్విచక్ర వాహనాలు మాత్రమే అనుమతించబడతాయి. ఈ వాహనాలు కేటాయించిన పార్కింగ్ ప్రదేశాలలోనే పార్కింగ్ చేయాలి.
భక్తులు పై సూచనలను పాటించి పోలీస్ శాఖకు సహకరించి జాతరను సజావుగా నిర్వహించేందుకు సహకరించగలరని సీఐ పేర్కన్నారు.