Indian Student | అమెరికాలో భారతీయ విద్యార్థి మిస్సింగ్.. ఐదు రోజులుగా వెతుకుతున్నా దొరకని ఆచూకీ
Indian Student : అమెరికాలోని క్యాలిఫోర్నియాలో చదువుతున్న సాకేత్ శ్రీనివాసయ్య అనే భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయాడు. దీంతో ఐదు రోజులుగా అధికారులు ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు.
Indian Student : అమెరికాలోని క్యాలిఫోర్నియాలో చదువుతున్న సాకేత్ శ్రీనివాసయ్య అనే భారతీయ విద్యార్థి కనిపించకుండా పోయాడు. దీంతో ఐదు రోజులుగా అధికారులు ఆ యువకుడి కోసం గాలిస్తున్నారు. కర్ణాటకకు చెందిన సాకేత్ శ్రీనివాసయ్య (22), అమెరికా, క్యాలిఫోర్నియాలోని క్యాలిఫోర్నియా బర్కెలీ అనే యూనివర్సిటీలో కెమికల్ అండ్ బయోమాలిక్యులర్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అతడు ఈ నెల 9 నుంచి కనిపించకుండా పోయాడు.
దీనిపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు, ఇతర అధికారులు అతడి కోసం ఐదు రోజులుగా గాలిస్తున్నారు. ముఖ్యంగా క్యాలిఫోర్నియా సిటీ మొత్తం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపడుతున్నారు. చివరగా అతడు క్యాంపస్‌కు ఒక కిలోమీటర్ దూరంలో కనిపించినట్లు పోలీసులు గుర్తించారు. అలాగే క్యాంపస్‌కు దగ్గరలో ఉన్న టిల్డెన్ రీజనల్ పార్క్ దగ్గర ఉన్న ఒక ఇంటి వద్ద అతడి బ్యాక్‌ప్యాక్, పాస్‌పోర్ట్, ల్యాప్‌టాప్‌ను అధికారులు గుర్తించారు. మరోవైపు దగ్గరలోని లేక్ అంజాలో, అలాగే బర్కెలీ హిల్స్ ప్రాంతంలో కూడా గాలిస్తున్నారు. లేక్ ప్రాంతంలో ప్రత్యేక బోట్లతో అధికారులు గాలింపు చేపట్టారు. అతడి సన్నిహితులు అక్కడ ఆన్లైన్లో కూడా అతడి కోసం వెతుకులాట ప్రారంభించారు. తన వివరాలు పోస్ట్ చేస్తూ, అతడిని చూసిన వారు సమాచారం అందించాలని కోరారు.
సాకేత్ మిస్సింగ్ అంశంపై శాన్ఫ్రాన్సిస్కోలోని ఇండియన్ ఎంబసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులత సమన్వయం చేసుకుంటూ అతడిని వెతికేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు. మరోవైపు అతడి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందిస్తున్నామని తెలిపారు. ఇక.. సాకేత్, అతడి స్నేహితులు కలిసి ‘మైక్రో ఛానల్ కూలింగ్ సిస్టమ్ ఫర్ హైపర్‌లూప్ అండ్ మెథడ్ థియరీ’ అనే టెక్నాలజీపై పేటెంట్ కూడా పొందారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon Movie | ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’ షూటింగ్‌పై క్రేజీ అప్డేట్.. నవంబర్ నుంచి కొత్త షెడ్యూల్ షురూ!
Ranabaali | విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. ‘రణబాలి’ డబ్బింగ్ వెర్షన్స్ విడుదల వాయిదా!
Riyadh airport | రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడిని తీవ్రంగా ఖండించిన భారత్..!
Suchitra Flyover | సుచిత్ర ఫ్లైఓవర్ పనులు వెంటనే ప్రారంభించాలి.. ఫ్లైఓవర్‌కు పిండ ప్రదానం.. వీడియో
Newzealand | భారత్‌తో వందేళ్ల క్రీడానుబంధం.. వన్డే సిరీస్ కోసం ప్రత్యేక జెర్సీ విడుదల..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

